Singapore: స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2025 ఏప్రిల్ 26 శనివారం నాడు 6వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు (Acharya Veludanda Nityananda Rao) విచ్చేసి సింగపూర్ (Singapore) లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకం అని చెప్పారు.
చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని, ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను మెచ్చుకొన్నారు సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.
ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ శ్రీ జ్యోతీశ్వర్ (Jyotishwar), శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమర్ (Kavutur Ratnakumar), TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి, కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు, మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష, సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న.
మరియు జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల, విష్ణు ప్రియ, సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష, అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్ గారు, KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్ లర్ గారిని సన్మానించారు.
స్వరలయ ఆర్ట్స్ (Swaralaya Arts), సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి (Yadavalli Seskumari) వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు (Padmaja Naidu) మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలం లో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు.
శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.
పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu), తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు.అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ (Tyagaraja) ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్నారు.
తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
పలువురినీ లలిత కళా రంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.