Connect with us

Music

Bay Area, California: వినాయక నవరాత్రుల సందర్భంగా చక్కగా హృదయ నాదం సంగీత విభావరి

Published

on

వినాయక నవరాత్రుల్లో (Ganesh Chaturthi) భాగంగా అమెరికా బే ఏరియా (Bay Area, California) లోని సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో “హృదయ నాదం” పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత చేకూర్చే ప్రక్రియను సంగీతకారుడు స్వర వీణాపాణి (Vogeti Naga Venkata Ramana Murthy) చక్కగా నిర్వహించారు.

సంగీతం పై అనేక ప్రయోగాలు చేసిన ఆయన SMART (Synchronized Music and Relief Therapy) అనే నూతన ప్రక్రియను వివరించారు. “భారతీయ సంస్కృతిలో సంగీతం భాగం. ఉరుకుల పరుగుల జీవితాలతో ప్రతిఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ప్రశాంతతను చేకూర్చే సంగీతాన్ని వీణాపాణి రూపొందించారు.

ఈ ప్రక్రియ చాల చక్కటి ఫలితాలను ఇస్తున్నది. ఇలాంటి మరో నూతన ప్రక్రియలో 72 మేళకర్త రాగాలను 61 గంటల 20 నిముషాలు లండన్ లో ఆవిష్కరణ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (Guinness Book of World Records) లో స్థానం దక్కించుకున్నారు” అని వక్తలు కొనియాడారు. “మనిషి జీవితం లో ఒత్తిడి, ఆందోళన, అలసటలను తొలిగించి సంగీతం ఆనందాన్ని ఇస్తుంది.

మనసును ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి కి తీసుకొని వెళ్తుంది. ధ్యానానికి తోడుగా సంగీతాన్ని ఉంచితే అది అలౌకిక ఆనందంలోకి తీసుకొని వెళ్తుంది. సంగీతం (Music) స్వరాలే కాదు అదొక దివ్య ఔషధం. సంగీతానికి ఎల్లలు లేవు భాష తో సంభందం లేదు. అందరూ హాయిగా వింటూ మనో వికాశాన్ని మానసిక ప్రశాంతను పొందుతున్నారు” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్వర వీణాపాణి (Swara Veenapani) ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) గారు, ఆలయ కమిటీ నిర్వాహకులు మారేపల్లి నాగ వెంకట శాస్త్రి గారు, తల్లాప్రగడ రావు గారు, నేమాని రాజశేఖర్ గారు, మృదంగ విద్వాన్ చిరంజీవి నేమాని భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected