Connect with us

Events

అంగరంగ వైభవంగా ‘నాట్స్’ మినీ తెలుగు సంబరాలు, మినీ సంబరాల్లో మాక్స్ వినోదం

Published

on

. SLPS కన్వెన్షన్ సెంటర్లో బ్యాంక్వెట్ డిన్నర్
. ఉత్సాహంగా పాల్గొన్న నాట్స్ నాయకత్వం
. అలరించిన స్టార్స్, కార్యక్రమాలు, సంగీత విభావరి
. మినీ సంబరాల్లో మాక్స్ వినోదం
. సంగీత దర్శకులు కోటికి జీవన సాఫల్య పురస్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మినీ తెలుగు సంబరాలను డాలస్ లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలి రోజు మార్చి 25 న ఏమాత్రం తగ్గకుండా ఆహూతులందరికీ మినీ సంబరాల్లో మాక్స్ వినోదాన్ని అందించారు.

ఈవేడుకల పరిచయ బ్యాంక్వెట్ డిన్నర్ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇర్వింగ్ లోని SLPS కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ మినీ సంబరాలకు ఆహ్వానితులుగా ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజ ఝవేరీ, సియా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ వుమన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్ అప్పసాని, డా. మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహనకృష్ణ మన్నవ, శ్రీనివాస్ మంచికలపూడి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణ ఎలమంచిలి, డా. ఆచంట, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, రాజేష్ కాండ్రు, రంజిత్ చాగంటి, మదన్ పాములపాటి, జ్యోతి వనం, మురళీకృష్ణ మేడిచెర్ల, కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ ఆరికట్ల, మూర్తి కొప్పాక, భాను ధూళిపాళ పాల్గొన్నారు.

అలాగే తెదేపా నాయకులు ముళ్ళపూడిబాపిరాజు, అరిమిల్లి నాగరాజు, డల్లాస్ ప్రవాసులు డా. ప్రసాద్ నల్లూరి, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, కే సిచేకూరి, శ్రీధర్ రెడ్డి కొర్రపాటి, చంద్రారెడ్డి, వినోద్ ఉప్పు, సురేష్ మండువ, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ప్రవాస బాల బాలికల నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బావర్చి రెస్టారెంట్ వారి ప్రత్యేక విందు ఏర్పాట్లు అందరి మన్ననలను పొందాయి. ప్రముఖ సంగీత దర్శకులు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసారు. తెలుగు సినీ కళాకారులు, గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలతో అందరినీ అలరించారు. నాట్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, జోనల్ ప్రెసిడెంట్లు, చాప్టర్ కోఆర్డినేటర్లు విజయవంతమైన ఈ సంబరాలకు హాజరయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected