Connect with us

Social Service

సేవ చేసేది నేనైనా, చేయించేది మాత్రం తానానే: Ram Sumanth Ramsetti

Published

on

మొత్తం టీం వేమూరి ప్యానెల్ (Team Vemuri) లో మచ్చటంగా, ఒద్దికగా, ఎవ్వరినీ తూలనాడకుండా, తను చేసిన సేవలను మాత్రమే గుర్తు చేస్తూ, యునీక్ ఫ్లయర్స్ తో కాంపెయిన్ లో ముందుకు సాగుతున్న అభ్యర్థుల్లో సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti) ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయంలో తప్పక అభినందించాల్సిందే.

తానా (Telugu Association of North America) లో న్యూయార్క్ స్పోర్ట్స్ ఛైర్ గా, నేషనల్ మెంబర్షిప్ కోఛైర్ గా, న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధిగా, రీసెంట్ గా ఫౌండేషన్ ట్రస్టీ (Foundation Trustee) గా మరియు ఐ క్యాంప్స్ సమన్వయకర్త గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అలాగే తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association – TLCA) లో అనేక సంవత్సరాలుగా వివిధ సేవలందించిన సుమంత్ ఇప్పుడు కార్యదర్శి (Secretary) గా పని చేస్తూ అందరికీ చేదోడువాదోడుగా ఉంటున్నారు. TLCA సంస్థ ప్రతి కార్యక్రమంలోనూ తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు.

సేవ చేసేది నేనైనా, చేయించేది మాత్రం తానానే; కాబట్టి మీరు వేసే ఓటు సేవ కి అంటూ కొత్తగా ప్రచారం నిర్వహిస్తున్నారు సుమంత్ రాంశెట్టి. అమెరికాలో తానా తరపున క్రూజ్ ఈవెంట్, స్పోర్ట్స్ ఈవెంట్స్, విద్యార్థులకు బ్యాగులు, 5కె రన్, పిల్లల పోటీలు, వెబినార్లు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఇంకా ఇండియాలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ సహాయ కార్యక్రమాలు, ఉచిత నేత్ర వైద్య (Eye Camps) శిబిరాలు, కాన్సర్ నిర్ధారణ శిబిరాలు, పోచంపల్లి నేత కార్మికులకు ఆశు యంత్రాల సహాయం, యోగా వర్క్ షాప్, బ్లడ్ డ్రైవ్స్, సీపీఆర్ శిక్షణా శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి మన్ననలు పొందారు.

న్యూయార్క్‌ (New York) లోనే కాకుండా ఇతర నగరాల్లో ఉన్న తానా సభ్యులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవంతో, ప్రస్తుత ఎన్నికల్లో తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్నాను అంటున్నారు సుమంత్ రాంశెట్టి. కలిసి నడుద్దాం.. తానా సేవలను విస్తరిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.

ఈ ఎన్నికల్లో గెలిపిస్తే తానా కార్యక్రమాలను మరింత విస్తృతపరచడంతోపాటు సభ్యులకు, కమ్యూనిటీకి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను ప్రాధాన్యత రూపంలో చేయాలన్న లక్ష్యానికి తానా (Telugu Association of North America) సభ్యుల తోడ్పాటును ఆశిస్తున్నారు.

న్యూయార్క్‌లోని తెలుగు కమ్యూనిటీకి తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) ద్వారా, జాతీయ స్థాయిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ద్వారా నిర్వహించిన కార్యక్రమాల ద్వారా న్యూయార్క్‌లోనూ, ఇతర ప్రాంతాల్లో ఉన్న మన తెలుగువారితో సుమంత్ అనుబంధం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.

తానా (TANA) లో పలు పదవులను నిర్వహించిన సుమంత్ (Sumanth Ramsetti) తానా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ చేశారు. అలాగే అవసరమైన వారికి సొంతంగా కూడా తనకు వీలైనంతవరకు సహాయాన్ని అందించారు.

అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ తానా ద్వారా చేస్తున్న సేవలు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నాయి అని భవిష్యత్తులో కూడా తానా ద్వారా కమ్యూనిటీకి మరింత సేవలందించాలన్న లక్ష్యంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 2023-27 సంవత్సరానికి గాను తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్నాను అని అన్నారు.

తనతోపాటు తమ టీమ్ వేమూరి (Team Vemuri) ని కూడా గెలిపించి ఆదరించాలని కోరుతున్నారు. తానా కార్యక్రమాలు అందరికీ చేరువ చేయాలన్న తన సంకల్పానికి తానా సభ్యులంతా తోడుగా ఉంటారని ఆశిస్తూ, ఈ ఎన్నికల్లో మీ ఓటుతో గెలిపించాల్సిందిగా మరోసారి అభ్యర్థిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected