Connect with us

Sports

500 క్రీడాకారులతో ఘనంగా సుధాకర్ కాట్రగడ్డ మెమోరియల్ వాలీబాల్ & త్రోబాల్ టోర్నమెంట్స్: TANA, Detroit

Published

on

కీర్తిశేషులు, తానా నాయకులు సుధాకర్ కాట్రగడ్డ గారి పేరుమీద వాలీబాల్ అండ్ త్రో బాల్ టోర్నమెంట్ తానా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు మరియు తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట ఆధ్వర్యంలో ఈ టోర్న మెంట్ జరిగింది.

నోవి నగరంలో స్పార్క్ అరీనా లో తానా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు క్రీడాకారుల నుంచి విశేషమైన స్పందన లభించింది. 37 టీమ్ లు, 500 మంది ప్లేయర్ లతో స్టేడియం కళ కళ లాడింది. మిషిగన్ అటారిని జనరల్ డేనా నెసేల్ గారు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

తానా చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంను ఇంత ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ నిస్వార్థ సేవా దృక్పథానికి, స్నేహశీలతకు, మంచితనానికి మారుపేరు సుధాకర్ కాట్రగడ్డ గారు. వారు తానాకు చేసిన సేవలు ఎంతో విలువైనవి.

ఎన్నో సేవలతో అశేష మైన తానా సభ్యుల అభిమానాన్ని పొందిన మహోన్నత వ్యక్తి సుధాకర్ గారు. వారి సేవలకు గుర్తింపుగా వారి పేరు మీద వాలీబాల్ అండ్ త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్న మెంట్ ద్వారా వచ్చిన విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు( ప్రభుత్వ హాస్పిటల్ లలో ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం) కోసం వినియోగించడం జరుగుతోంది అన్నారు.

తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ హనుమయ్య బండ్ల గారు మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తానా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ నిర్వాహకులకు అభినందనలు అందజేశారు.

ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి ప్రోత్సాహంతో జరిగింది. స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ గారు, రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గోగినేని గారు మరియు స్థానిక తానా నాయకులు ఇతర పెద్దలు హాజరై ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected