Connect with us

Health

నిధుల సమీకరణలో భాగంగా విజయవంతంగా తామా ఫ్రీ క్లినిక్ 5K Walk @ Cauley Creek Park, Johns Creek

Published

on

Johns Creek, Atlanta: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) ఆధ్వర్యంలో జూలై 19, 2025 శనివారం, జాన్స్ క్రీక్ నగరంలోని కాలీ క్రీక్ పార్క్ (Cauley Creek Park) లో “5K నడక” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ నడక ద్వారా తామా ఉచిత వైద్యశాలకు నిధుల సమీకరణ చేయడం జరిగింది.

ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 11 గంటల వరకు కొనసాగి, అన్ని వయస్సుల నుంచి దాదాపు 400 మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి జాన్స్ క్రీక్ నగర మేయర్ Mr. John Bradberry ముఖ్య అతిథిగా హాజరై, నడకను ప్రారంభించి తామా చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. “ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు కనీసం 30 నిమిషాలైనా నడవాలి” అని సూచించారు.

పాల్గొన్నవారు రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద ప్రియ గారు మరియు శ్రీనివాస్ గారు అందించిన తామా (TAMA) టీషర్టులు తీసికొని కొని, శిరీష గారి ఆధ్వర్యంలో తెలుగు, హిందీ, ఆంగ్ల పాటలకు జుంబా నృత్యం లో చురుగ్గా పాల్గొన్నారు. తామా బోర్డు చైర్మన్ రాఘవ తడవర్తి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 12,000 మందికి పైగా పౌరులకు ఉచిత వైద్యసేవలు అందించబడ్డాయి.

ఈ సేవల్లో 60 మంది వైద్యులు, 80 మంది వాలంటీర్లు, 100 మంది యువ వాలంటీర్లు కృషి చేశారు. నడక ముగించిన వారిలో విజేతలను నాలుగు విభాగాలుగా గుర్తించి బంగారు, రజత, కాంస్య పతకాలు అందజేయడం జరిగింది. దాతల విరాళాలతో నిరంతరం నడుస్తున్న సేవ. ఈ కార్యక్రమం ద్వారా నిధుల సేకరణలో పెద్ద ఎత్తున దాతలు, స్పాన్సర్లు పాల్గొన్నారు.

Presenting Sponsors ($5K):

డాక్టర్ గురు ప్రసాద్ గంట, బిర్యానీ వరల్డ్ (Biryani World)

Signature Sponsors ($2.5K):

·        శ్రీ ధనుంజయ్ జల్ల, ఆల్ఫా ఎగ్జిక్యూ స్వీట్స్ (Alpha Execu Suites),

·        శ్రీ అనిల్ గ్రంధి (AG FinTax),

·        శ్రీ నగేష్ కాశం అమృత్ ఆయుర్వేద (Amruth Ayurveda),

·        వైద్య హెల్త్ (Vydya Health),

·        శ్రీ అబ్రార్ ఖాన్,

·        శ్రీ రమేష్ మాటూరు, పిరమిడ్ కన్సల్టింగ్ (Pyramid Consulting),

·        శ్రీ రాజేష్ జ్యోతిషి, మెడ్ రేట్స్ (Med Rates),

·        శేఖర్ కొల్లు రియాల్టర్ (Sekhar Kollu Realtor),

·        ఇండిఫ్రెష్ (IndiFresh)

Elite Sponsors ($1K):

·        శ్రీ వెంకట సుబ్బారావు మద్దాలి

·        శ్రీ క్రిష్ గద్దె, అల్లైడ్ ఇన్ఫోర్మాటిక్స్ (Allied Informatics)

·        గరుడవేగా

·        శ్రీ డాక్టర్ అపర్ణ పీతాంబరం Twinkle Pediatrics LLC

·        శ్రీ సునీల్ రెడ్డి కూటూరు, రంగ్ సిప్ & డైన్ (Rang Sip & Dine)

·        శ్రీ డాక్టర్ సృజన బద్దం

·        శ్రీ డాక్టర్ నందిని సుంకి రెడ్డి: (Aspire Medical Group)

·        సిస్ ఆర్చ్ ఇంక్ (sys Arch Inc)

·        శ్రీ రవి కల్లి

·        శ్రీ సాయిరాం కారుమంచి

·        శ్రీ ఉపేంద్ర రాచుపల్లి

విరాళాలు అందించిన ఇతర దాతల పేర్లు:

శ్రీ లక్ష్మి నారాయణ చారుగుండ్ల, శ్రీ వెంకట్ తేరాల, శ్రీ డాక్టర్ జయ వల్లభనేని ఫామిలీ డెంటిస్ట్రీ (Jaya Vallabhaneni Family Dentistry), శ్రీ నాగేష్ దొడ్డాక, శ్రీ చలమయ్య బచ్చు, GPS కిడ్స్ (పబ్లిక్ స్పీకింగ్ క్లబ్) (GPS Kids Public Speaking Club), శ్రీ ప్రవీణ్ బొప్పన్న (Benn Sys), శ్రీ రాంకీ చౌడారపు, శ్రీ వెంకట్ మీసాల, శ్రీ సునీల్ దేవరపల్లి, శ్రీ సురేష్ యాదగిరి, శ్రీమతి సునీత పొట్నూరు.

శ్రీ రూపేందర్ వేములపల్లి, శ్రీ చిట్టారి పబ్బ (AHP Real Estate Ventures), శ్రీ ప్రియా బలుసు, శ్రీ శ్రీనివాస్ లావు (Delta Information Systems) , శ్రీ కోటేశ్వరరావు కందిమళ్ల, శ్రీ రాము కేసాని, మరియు శ్రీ శ్రీనివాస్ రామి శెట్టి (Ample Technologies), శ్రీ రవి చందర్ (Softpath System), శ్రీ పవన్ దేవులపల్లి, శ్రీ వెంకట్ దుగ్గి రెడ్డి, శ్రీ సత్య గుత్తుల, శ్రీ శ్రీనివాస్ ఉప్పు (AnSai Tech), శ్రీ ఐనయ్య ఎనుముల.

శ్రీ మూర్తి రాళ్ళపల్లి, శ్రీ కమల్ సాతులూరు, శ్రీ కరుణాకర్ ఆసిరెడ్డి, శ్రీ భరత్ మద్దినేని (Maxeom), శ్రీ భాస్కర్ చల్ల, శ్రీ రామ్ మద్ది, శ్రీ మహేష్ పవర్, శ్రీ రాజేష్ జంపాల, శ్రీ వినయ్ మద్దినేని, శ్రీ మనోజ్ తాటికొండ, శ్రీ హితేష్ వడ్లమూడి, శ్రీ శ్రీనివాస్ కడియాల, మరియు శ్రీ కృష్ణ కొత్త, శ్రీ శ్రీధర్ దొడ్డపనేని, శ్రీ శ్రీరామ్ రొయ్యల, శ్రీ ఉపేంద్ర నర్రా.

ఇతర సంఘాల భాగస్వామ్యం

తానా (TANA), ఆటా (ATA), నాటా (NATA), నాట్స్ (NATS), టిటిఎ (TTA), టిడిఎఫ్ (TDF), నార్వా (NRIVA), గేట్స్ (GATeS) వంటి ఎన్నో భారతీయ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

భారతీయ అతిథుల స్పందన

భారతదేశం నుండి వచ్చిన పెద్దలు నడక తమ పిల్లలను, మనుమల్ని దగ్గర చేస్తూ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మంచి కార్యక్రమంగా అభివర్ణించారు. బిర్యానీ వరల్డ్ అందించిన ఇడ్లీ, వడ, పొంగల్, తేనీరు, కాఫీ వంటి అల్పాహారాలతో కార్యక్రమానికి మరింత రుచి జోడించబడింది. Krispy Cream వారు Donuts ను అందించారు.

క్లినిక్ డైరెక్టర్ నాగేష్ దొడ్డాక (Nagesh Doddaka) ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క వాలంటీర్, స్పాన్సర్, మీడియా, పార్క్ అధికారులు, అల్పాహార సదుపాయం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “ఉచిత వైద్య సేవలను మరింత విస్తృతంగా కొనసాగించాలంటే దాతలు మరింత ముందుకు రావాలని” పిలుపునిచ్చారు. మీరు కూడా ఈ కార్యచరణలో భాగస్వాములవ్వండి. ఆరోగ్య సేవల కొరకు తామా చేపడుతున్న ప్రయత్నాలను మద్దతు ఇవ్వండి.

error: NRI2NRI.COM copyright content is protected