Connect with us

Associations

యువతరానికి ఉపయోగకరంగా తానా సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా‘ నిర్వహించిన సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు విజయవంతమవ్వడమే కాకుండా యువతలో ఉత్సాహాన్ని నింపాయి. 3500 మంది చిన్నారులు పాల్గొన్న ఈ క్యాంపులో క్రియేటివ్ ఆర్ట్ క్యాంప్, చెస్ క్యాంప్, పైథాన్ ప్రోగ్రామ్, లిటిల్ చెఫ్ బేకింగ్ క్యాంప్, వన్స్ అపాన్ ఎ టైమ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, టాలివుడ్ డ్యాన్స్ మస్తీ, మ్యాథ్ ఎన్రిచ్మెంట్ వంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా 35000 డాలర్లకు పైగా విరాళాలను సేకరించడం విశేషం.

ముందుగా సమ్మర్ క్యాంప్ రూపకర్త, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి ముందు మాటలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అతిథులందర్నీ పరిచయం చేస్తూ, ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చూసి మార్గనిర్దేశనం చేశారు. ఈ సమ్మర్ క్యాంపు ప్రస్తుత యువ తరానికి, తానా కార్యవర్గానికి వారధిగా నిలుస్తోందని అన్నారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి క్యాంపులను నిర్వహిస్తున్నామని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్యాంప్ వెనుక చాలా కృషి ఉందని, ఓ పెద్ద కార్యక్రమమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని అన్నారు. పిల్లలందరూ భవిష్యత్ నిర్మాతలని, కేవలం తానాకు మాత్రమే పరిమితం కాదని, దేశానికే విధాతలని పేర్కొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెనకుండి సహకరిస్తున్న తానా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. రాబోయే రోజుల్లో ‘తానా బాలోత్సవం’ కూడా నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. తానా ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందని, తానా కార్యవర్గం అంతా కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని అంజయ్య చౌదరి లావు ఆకాంక్షించారు.

తానా కోశాధికారి అశోక్‌బాబు కొల్లా మాట్లాడుతూ తానా సమ్మర్ క్యాంపుకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిన్నారులను ప్రోత్సహిస్తూ, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి తల్లిదండ్రులు ఇతోధికంగా సహాయపడుతున్నారని ప్రశంసించారు. మరో వైపు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మర్ క్యాంపును విజయవంతం చేశారు. ఈ సమ్మర్ క్యాంపు విజయవంతంగా సాగడానికి శశాంక్ యార్లగడ్డ, రవి వడ్లమూడి, దిలీప్ ముసునూరి, సుమంత్ రామిసెట్టి, ప్రదీప్ గడ్డం, వంశి వాసిరెడ్డి, వెంకట మీసాల, సునీల్ కోగంటి, రత్న ప్రసాద్ గుమ్మడి, సౌమ్య సూరపనేని, రాజేశ్ యార్లగడ్డ, నాయుడమ్మ యలవర్తి, సుధీర్ నారెపలేపు, రేఖ ఉప్పులూరి, రమణ అన్నె, అబ్దుల్ కలామ్ ఆకుల, ఠాగోర్ మల్లినేని, ఫణి కంతేటి, శైలజ చల్లపల్లి, శ్రీ కోనంకి, గోపి వాగ్వల, వెంకట్ సింగు, చంద్ర సిరిగిరి, రంజిత్ మామిడి, తమ సహాయ సహకారాలు అందించారు. చివరగా తానా కార్యదర్శి సతీశ్ వేమూరి ధన్యవాద సమర్పణ గావించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected