తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా. కోడెల శివప్రసాద్ తనయులు డా. కోడెల శివరాం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta, Georgia) నగరంలో డా. కోడెల శివరాం తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమ్మింగ్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహ ప్రాంతం ఈ కార్యక్రమానికి వేదికైంది.
ముందుగా వెంకీ గద్దె అందరికీ స్వాగతం పలికి, డా. కోడెల శివరాం (Dr. Kodela Sivaram), అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, సురేష్ కరోతు, రాఘవ పుల్లెల లను వేదిక మీదకు ఆహ్వానించారు. డా. కోడెల శివరాం కి పుష్పగుచ్చంతో రామకృష్ణ స్వాగతం పలికారు.
నేతలందరూ డా. కోడెల శివప్రసాద్ (Dr. Kodela Siva Prasada Rao) చిత్ర పఠానికి పూలతో నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక నేతలందరూ డా. కోడెల శివప్రసాద్ ని స్మరిస్తూ తను ఎమ్మెల్యేగా, మంత్రిగా, సభాపతిగా చేసిన సేవలను కొనియాడారు. అలాగే రూపాయి డాక్టర్ గా పేదలకు అందించిన సేవలను అభినందించారు.
అనంతరం డా. కోడెల శివరాం మాట్లాడుతూ… ఇప్పటికీ తను కోడెల గారి అబ్బాయి అనిపించుకోవడానికే ఇష్టపడతానని, 1983 లో రాజకీయాలలోకి ప్రవేశించిన పరిస్థితులు, చనిపోయే వరకు పార్టీని అంటిపెట్టుకొని ఉన్న విధానం, చేసిన సేవలు, అభివృధ్హి వంటి విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
కోడెల బిడ్డగా పదవి ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలోనే ఉంటానని, తనకు చేతనైనంత వరకు సేవ చేస్తూనే ఉంటాను అని మాట ఇస్తున్నానని అన్నారు. అన్నగారి విగ్రహ ప్రాంతంలో ఇంత చక్కని ప్రోగ్రాం ని ఏర్పాటు చేసిన తెలుగు తమ్ముళ్లకు, హాజరయిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే ప్రవాసులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వంలో ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృధ్హికి, అటు పార్టీకి తోడ్పాటు అందించాలని కోరారు. ఇండియా వచ్చినప్పుడు తిరుపతి దర్శనం ఇతరత్రా వంటి సహాయం కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని సభికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.
తదనంతరం మల్లిక్ మేదరమెట్ల మరియు శ్రీధర్ (బాబీ) కొమ్మాలపాటి ప్రసంగించగా, వీరయ్య చౌదరి బొడ్డపాటి మరియు సుమన్ శాలువాతో డా. కోడెల శివరాం (Dr. Kodela Sivaram) ని ఘనంగా సత్కరించారు. వేదిక ప్రాంగణాన్ని టీడీపీ జండాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, డా. కోడెల శివప్రసాద్, లోకేష్ కటౌట్లతో అలకంరించిన విధానం బాగుంది.
జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ నినాదాల నడుమ డా. కోడెల శివరాం (Dr. Kodela Sivaram) ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ఆసాంతం అందరూ ముక్తకంఠంతో పల్నాటి పులి కోడెల, జోహార్ కోడెల, అమర్ రహే కోడెల అంటూ డా. కోడెల శివప్రసాద్ కి నీరాజనం పలికారు.
చివరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ డా. కోడెల శివరాం తో ప్రత్యేకంగా ఫోటోలు దిగడమే కాకుండా, నాన్నగారిలా మీరు కూడా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అని అభినందిస్తూ, కోడెల గారి లెగసీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వందన సమర్పణ (Vote of Thanks) తో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.