Connect with us

Devotional

రంగ రంగ వైభవంగా TTA Seattle Chapter బోనాలు, డప్పుల మధ్య అమ్మవారి ఊరేగింపు

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) సియాటిల్ శాఖ (TTA Seattle Chapter) విజయవంతమైన బోనాలు పండుగను నిర్వహించింది. అమ్మవారిని వాహనంపై ఊరేగిస్తూ భక్తులు తెచ్చిన బోనాలతో ఊరేగింపు యాత్ర, బోనాలు డప్పుల మధ్య రంగ రంగ వైభవంగా జరిగింది.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సియాటిల్ శాఖ ఇటీవల అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) ఆధ్వర్యంలో బోనాలు పండుగ (Bonalu Festival) ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం 600 మందికి పైగా భక్తులను ఆకర్షించి విజయవంతమైంది.

అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ సభ్యులు మనోహర్ బోడికే, ప్రదీప్ మెట్టూ, ఈవెంట్ కోఆర్డినేటర్ ప్రియాంక రెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గణేష్ మాధవ్ వీరమనేని, సంగీత రెడ్డి మరియు ఇతర సభ్యులు ప్రియాంక ముంజులూరి, కేశవ్ రెడ్డి, ప్రసాద్ సేనాపతి, శ్యామ్, శ్రీధర్ చదువు, రాజేందర్ అజమేరాలకు మన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన WATA (Washington Telangana Association) మరియు WATS బృందాలకు, వాలంటీర్లకు మరియు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. WATA నాయకులు రవి సాధు (అధ్యక్షుడు, WATA ), సందీప్ బుషణం, అనూ కుంట, భరత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్ లాలనోల్లా, శ్యామ్, వినీత్, రవీందర్ వీరవల్లి లకు ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే WATS (Washington Telugu Samithi) నాయకులు సునీత కొత్తపల్లి, రామ్ పాలూరి, జయపాల్ దొడ్డ, మధు రెడ్డి, రామ్ జనకి మరియు ఇతర బృంద సభ్యులు మంజునాథ్ బేసటి, చందు, నవీన్ దోర్నడ్ల, లవ కుమార్, వినయ్, రోహిత్, శివ మరియు శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

TTA సమాజ బంధాలను పెంపొందించడంలో మరియు మన పండుగలలో భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో ఉంది. తెలంగాణ (Telangana) మరియు తెలుగు సంస్కృతి (Telugu Culture) ని ప్రోత్సహించడంలో TTA సంఘం ముందంజలో ఉంది అన్నారు నిర్వాహకులు.

Telangana American Telugu Association Seattle Chapter కార్యక్రమానికి హాజరైన మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected