చేయి చేయి కలిపితే “ఆప్యాయత”, కాపుదలలో పుట్టింది “ఆప్త”, వేదికైయ్యింది “అట్లాంటా”. అన్ని కలిపితే అదే ఆప్యాయ ఆప్త అట్లాంటా”. ఎన్నో మైలురాళ్ళను తిరగరాసిన ఆప్త (American Progressive Telugu Association) ఉగాది సంబరాలు, మచ్చుకు కొన్ని…
సుమారు 750 నుండి 800 వరకు విచ్చేసిన ఆప్తుల కలయిక. నెక్స్ట్ జెన్ కిడ్స్ – అడుగడునా, ప్రతీ విభాగంలోనూ వారిదైన సేవలు. బ్యేక్ టు బ్యేక్ సాయింత్రం 4 గంటల నుండి రాత్రి 11:30 వరకు వరుస కార్యక్రమాలు. వివిద రాష్ఠాల నుండి తరలివచ్చిన ఐబై కుటుంబాలు. రాఫెల్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్. ఎల్.ఇ.డి స్క్రీన్స్, కోల్డ్ ఎలక్ట్రిక్ ఫైర్స్ లాంటి కొంగొత్త హంగులు. 360 డిగ్రీస్ ఫొటో బూత్.
అట్లాంటా స్తానిక దులుత్ హైస్కూల్ లో ఏప్రిల్ 1వ తేదీ సాయింత్రం నాలుగు గంటలకు పిల్లలచే గాలిపటాలు ఎగురవేయించటంతో ఆప్త ఉగాది వేడుక మొదలైంది. అటు ఆప్త ఆడపడుచులచే రంగు రంగు ముగ్గులతో రంగొలి పోటీలు. ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన జెనరల్ సెక్రెటరి శ్రీ సత్య బొలిసెట్టి గారు మరియు వారి శ్రీమతి నాగమణి బొలిసెట్టి గారు చేతుల మీదుగా ఆప్త కోర్ ఎక్షిక్యూటివ్ మరియు బోర్డ్ వారి అద్వర్యంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది.
అట్లాంటావేదపండితులు శ్రీ ఫని గారు పంచాంగ స్రవనం చేయడం జరిగింది. సౌత్ ఈస్ట్ అట్లాంటిక్ ఆర్.వి.పి శ్రీ వెంకట గోక్యాడ గారి స్వాగతవచనాలతో ప్రారంభమై, ఎటువంటి విఘ్నాలు కలుగకుండా గణపతిని స్తుతిస్తూ పాటలు మరియు నృత్య కార్యక్రమాలు, తరువాత పిల్లలు పెద్దలచే పలు సాంఘిక కార్యక్రమాలు ఆహుతులను అలరించింది.
2021 సంవత్సరానికిగాను ఇండియా ప్రెసిడెంట్ శ్రీ రాం నాత్ కోవింద్ గారు చేతులమీదుగ ఎన్.ఆర్.ఐ లకు భహుకరించే అతున్నత పురస్కారం ప్రవాస భారతీయ సన్మాన్ అందుకొన్న మన ప్రియతమ ఆప్తుడు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ గారిని సన్మానించడం జరిగింది. అటుపిమ్మట పసందైన వంటకాలతో, నోరూరించే ఐటంస్ అప్తులు ఆరగించారు.
తరువాత టాలివుడ్ గాయకులు, సంగీత ధర్శకులు మరియు నటులు శ్రీ రఘు కుంచె గారు, టాలివుడ్ గాయని మనీష ఎర్రబత్తిన గారు, శ్రవణ్ గారు మరియు జానపద గాయకులు జనార్ధన్ పన్నెల గారు సంగీతవిభావరి ఆహుతులను అలరించడమే కాకుండా, చిన్నారులు వేదికపైకెక్కి నృత్యం చేయడం అబ్బురపరిచింది. ఈ చక్కటి కార్యక్రమానికి బైట్ గ్రాఫ్ వారు పూర్తి ఆడియో విజువల్స్ మరియు ఫొటొగ్రఫి / విడియోగ్రఫి ఉచితంగా అందించారు.
స్పాన్సర్స్ వివరాలు: డైమండ్ స్పాన్సర్స్:- Naartheast Mortgage Inc Focus Consulting Services Magnus Opus ByteGraph
గోల్డ్ స్పాన్సర్స్:- Vishi & Vikhy LLC MRK Financial Services BeyondID ERP setu PakkaLocal Indian Flavors Sterling Decors DJ Tillu DVAN LLC VPR
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాలో వివిద రాష్ఠాల నుండి ముఖ్యులు హాజరుకావడం విశేషం. వీరిలో ఆప్త ఆప్త బోర్డ్ చైర్ శ్రీ సుబ్బు కోట గారు, ఫౌడింగ్ కమిటి టీం శ్రీ ప్రసాద్ సమ్మెట గారు, శ్రీ చందు శ్రీనివాస్ గారు, శ్రీ శ్రీనివాస్ చిమట గారు ,ఆప్త ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ బాస్కర్ కొట్టె గారు, జాయింట్ ట్రెజరర్ శ్రీమతి జ్యోతి గాజుల గారు , మాజి అద్యక్షులు శ్రీ గోపాల్ గూడపాటి గారు,సౌత్ పసిపిక్ ఆర్.వి.పి కొండల వాయినేని గారు, శ్రీ రత్నాకర్ గారు సెంట్రల్ ఆర్.వి.పి,ఫ్లోరిడ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ దాస్ ఆకుల గారుఉన్నారు.
అలాగే టెక్సాస్ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ దిలీప్ రామిసెట్టి గారు ,గ్లోబల్ ఆపరేషన్స్ చైర్ శ్రీ మధు వుళ్ళి గారు, స్పెషల్ నీడ్స్ వైస్ చైర్ శ్రీమతి దేవి గడ్డం గారు, స్పిరిచ్చువల్ చైర్ రజని తాడి గారు, ఎలక్షన్ కమిటి చైర్ శ్రీ సత్య సుందరనీడు గారు, ఇన్నొవేషన్ థింక్ టేంక్ చైర్ శ్రీ రమేష్ బాస గారు, న్యూస్ మిడియా చైర్ శ్రీ చంద్ర పోలిసెట్టి గారు, బిజినెస్ వైస్ చైర్ శ్రీ రాజేష్ యాళ్ళబండి గారు, 2024 టీం తరుపున వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదవ్ తళారి గారు , శ్రీ శ్రీనివాస్ నండూరి గారు , శ్రీనివాస్ చల్లా ఫ్రం చార్లెట్, మరియు శ్రీ సోమ శేఖర్ (సంపత్ మాదాల గారు తండ్రి గారు) ఫ్రం వర్జినియ నుండి పాల్గొనడం జరిగింది.
ఇంత చక్కని కార్యక్రమానికి నెక్స్ట్ జెన్ కిడ్స్ వాలంటీరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ విభాగంలోను వారు ఉనికి చాటుకోవడమే కాకుండా, వారి చేతుల మీదుగా జరిగిన ఎక్షిక్యషన్ ఆప్తులను ఆనందపరించింది. అలాగే ఇంత భారిఎత్తున జరిగిన ఉగాది వేడుకలకు గడిచిన వారం రోజులుగా ఎంతో సమయాన్ని శ్రమని కెటాయించిన వాలంటీర్స్ అందరికి అభినందనలు.