తగ్గేదేలే విక్టరీ జై బాలయ్య అంటూ ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోస్ పేర్లు ఒకేసారి చెప్తున్నానేంటని అనుకుంటున్నారా! అమెరికాలో ఒకేసారి ఒకే కన్వెన్షన్ (Convention) కి ముగ్గురు తోపు తెలుగు సినీ హీరోస్ (Telugu Movie Heroes) వస్తుంటే ఆమాత్రం హడావిడి ఉండాలి కదా!
తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ (Allu Arjun), నా పేరులోనే విక్టరీ ఉందంటూ దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh), జై బాలయ్య అంటూ నందమూరి బాలక్రిష్ణ (Nandamuri Balakrishna) ఈ కన్వెన్షన్ కి తరలి రానున్నారు. ఈ మహామహులు హాజరయ్యే ఆ కన్వెన్షన్ ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు, ఎవరు నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారా!
అక్కడికే వస్తున్నా! అదేనండి ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోని టాంపా (Tampa) మహానగరంలో జులై 4, 5, 6 తేదీలలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న 8వ కన్వెన్షన్ లో పాల్గొని మనందరినీ అలరించడానికి ఉత్తర అమెరికాలో కాలు పెట్టనున్నారు ఈ త్రయం.
వీరితోపాటు టాలీవుడ్ టాప్ క్యూటీ శ్రీలీల & టాలీవుడ్ (Tollywood) చిట్టి ఫరియా అబ్దుల్లా, ముందుతరం హీరోయిన్స్ మీనా & జయసుధ, బ్లాక్బస్టర్ నిర్మాతలు అల్లు అరవింద్ & దిల్ రాజు, యాంకర్స్ సుమ & రవి, తనికెళ్ళ భరణి & చంద్రబోస్ వంటి సాహితీవేత్తలు, నటి పూర్ణ, పలువురు జబర్దస్త్ హాస్య నటులు మరియు రాజకీయ నాయకులు రానున్నారు.
అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) తో పాటు పుష్పతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన సుకుమార్ (Sukumar), వీరసింహారెడ్డితో అందరి చేత జై బాలయ్య అనిపించిన గోపిచంద్ మలినేని (Gopichand Malineni), గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar), ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్‌లు (Meher Ramesh) విచ్చేయనున్నారు.
వీరందరూ ఒక ఎత్తైతే, నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈ సారి ప్రముఖ సంగీత దర్శకులు తమన్ (Ghantasala Sai Srinivas Sivakumar – SS Thaman) తోపాటు దేవిశ్రీ ప్రసాద్ (Gandham Devi Sri Prasad – DSP) కూడా పాల్గొనడం, మ్యూజికల్ కాన్సర్ట్స్ తో అలరించనుండడం మరొక ఎత్తు.
ఈ రేంజ్ లో ప్రత్యేక ఆకర్షణ ఉన్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు (NATS Convention) టికెట్స్ ఓపెన్ చేశారు. ఇక ఆలస్యం ఎందుకు! త్వరగా https://sambaralu.org/buynow ని సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నాట్స్ సభ్యత్వం ఉన్నవారికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయడం విశేషం.
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ & నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi) మరియు నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) సారధ్యంలోని పలు కమిటీలు కన్వెన్షన్ విజయవంతం కోసం నిరంతరం పనిచేయడం అభినందనీయం.