Connect with us

Education

SAANA: అమెరికాలో ఒక్కటవుతున్న భీమవరం @ NATS Conference, New Jersey

Published

on

. ఎస్ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధులు
. సానా పేరిట కొత్త సంఘం ఏర్పాటు
. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

అమెరికాలో ఇప్పుడు తెలుగువారు ఎక్కడుకున్నా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా భీమవరానికి చెందిన ఎస్ఆర్‌కెఆర్ (SRKR Engineering College) పూర్వ విద్యార్ధులంతా మనమంతా ఒక్కటే అంటూ కొత్తగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

సానా (ఎస్ఆర్‌కెఆర్ఈసీ ఆలంనై అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. భీమవరం (Bhimavaram) లో ఎస్ఆర్‌కెఆర్ఈసీ కి దాదాపు 43 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్ధులు ఉత్తర అమెరికా, యూకే తోపాటు అనేక దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.

ప్రస్తుతం ఉత్తర అమెరికాలో ఉంటున్న ఎస్ఆర్‌కెఆర్ఈసీ (SRKREC) పూర్వ విద్యార్థులంతా సానా (SAANA) పేరుతో ఓ సంఘంగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే మే నెల 27వ తేదీన నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఎస్ఆర్‌కెఆర్ఈసీ పూర్వ విద్యార్ధులంతా సమావేశం కావాలని నిశ్చయించుకున్నారు.

అమెరికాలో ఉంటున్న ఎస్ఆర్‌కెఆర్ఈసీ పూర్వ విద్యార్ధులంతాక సానా సంఘంలో సభ్యులుగా చేరి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేయాలని సానా కోరింది. భీమవరం అనుభవాలను పంచుకోవడానికి, కాలేజీ మధురానుభూతులను గుర్తు చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశమని సానా ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికా, కెనడా, మెక్సికో ప్రాంతాలనుండి సానా (SAANA – SRKREC Alumni Association of North America) లో సభ్యులుగా చేరేందుకు https://tinyurl.com/34xp6kja లో కనెక్ట్ కావాలని కోరింది. అలాగే సానా (SAANA) మొట్టమొదటి పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు https://tinyurl.com/mts8fkdr లో మీ పేరు నమోదు చేసుకోండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected