Connect with us

Devotional

తానా ఆధ్వర్యంలో జూన్ 6న శ్రీనివాస కళ్యాణం @ Hicksville, New York

Published

on

Hicksville, New York: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూయార్క్ టీమ్ (TANA New York Chapter) ఆధ్వర్యంలో శనివారం జూన్ 6వ తేదీన శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు (Srinivas Bharthavarapu) ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో సంప్రదాయ టీటీడీ విధానంలో ఈ పవిత్ర వేడుకను హిక్స్‌విల్లే (Hicksville, New York) లోని ఆసమాయి హిందూ దేవాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రవాస తెలుగువారందరూ కుటుంబ సమేతంగా విచ్చేయాలని ఆయన సాదరంగా ఆహ్వానించారు.

కమ్యూనిటీ బలోపేతమే లక్ష్యం

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali) మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ వేడుకలో కమ్యూనిటీ సభ్యులందరూ కలిసి పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని శ్రీనివాస్ భర్తవరపు కోరారు. న్యూయార్క్ టీమ్ సభ్యులు (TANA New York Chapter) సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ (Dilip Musunuru) ముసునూరు, ప్రసాద్ కోయి, శ్రీనివాస్ నాదెళ్ల (Srinivas Nadella) ఈ కార్యక్రమ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు.

ఈ (Devotional) వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం (347) 668-9861 నంబర్‌లో సంప్రదించవచ్చని శ్రీనివాస్ భర్తవరపు (Srinivas Bharthavarapu) వివరించారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ కమ్యూనిటీ స్ఫూర్తిని చాటిచెప్పే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

error: NRI2NRI.COM copyright content is protected