Connect with us

News

ఆర్ధికంగా మరియు హార్ధికంగా తోడ్పాటు అందిస్తున్న Srinivas Lavu

Published

on

అమెరికా అయినా ఇండియా అయినా సమాజసేవలో తను ముందుండి ఆకళింపు చేసుకుంటూ కార్యదక్షతతో, నూతన ఆలోచనలతో నలుగురికి మార్గదర్శకునిగా నిలబడేవారే అసలు సిసలు నాయకులు. వారినే టార్చ్ బేరర్స్ అంటారు. నిస్వార్ధ సేవే లక్ష్యంగా వీరు విస్తృతస్థాయిలో అభివృద్ధి పథంలో నడిపిస్తారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే వారే అట్లాంటా నగర వాసి శ్రీనివాస్ లావు (Srinivas Lavu).

తన నాయకత్వ పటిమతో తర తమ బేధం లేకుండా, సగటు మనిషికి అవసరమైన విద్య, ఆరోగ్య, సామాజిక పరమైన అంశాలలో ఆర్ధికంగా మరియు హార్దికంగా సేవలందిస్తూ, ఇటు అమెరికాలో అటు రెండు తెలుగు రాష్ట్రాలలో స్ఫూర్తిదాయకంగా అందరి మన్ననలు పొందుతున్నారు శ్రీనివాస్ లావు.

చిన్న వయసులోనే ఎన్నో విజయాలను సాధించి, స్వయంగా డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ స్తాపించి, విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా ఎదిగి తెలుగు వారికి ఎంతో గర్వకారణం అయ్యారు శ్రీనివాస్ లావు. మన తెలుగు వారికి సహాయ పడటానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా జాతీయ మరియు స్థానిక సంస్థలలో తన అద్వితీయ నిర్వహణా సామర్ధ్యంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

నాయకత్వమంటే భాగస్వామ్యం, సహకారం, మార్గదర్శకత్వం, మద్దతు అందించడం అని బలంగా నమ్మే శ్రీనివాస్ లావు, అమెరికా అంతటా తెలుగు వారి కార్యకలాపాలకు సహాయ పడటానికి TANA TEAM Square మరియు NATS హెల్ప్‌లైన్‌కు ఎంతో కృషి చేశారు. 2016లో ప్రతిష్టాత్మకమైన TANA ఫౌండేషన్ మన వూరి కోసం 5k రన్ కార్యక్రమాలు అమలుపరచడానికి కీలక పాత్ర పోషించి అట్లాంటాలో అతిపెద్ద TANA 5k వాక్‌ నిర్వహించారు.

అట్లాంటాలో TAMA బిల్డింగ్ ప్రాజెక్ట్ కోసం నిధుల సేకరణ చేశారు. TAMA 30 వసంతాల వేడుకల్లో బాంక్వెట్ కమిటీ అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వర్తించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఛైర్మన్‌గా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఇండియా లోని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించే ప్రాజెక్ట్ కి తోడ్పాటు అందించారు. అలాగే ఆరోగ్య భీమా లేని వారికి మరియు ఇండియా నుంచి అమెరికా వచ్చిన తల్లితండ్రుల కోసం అట్లాంటా లో TAMA Free Clinic ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు శ్రీనివాస్ లావు. ఈ ఫ్రీ క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా ఆరోగ్య సేవలందించడం అభినందనీయం.

విపత్తు సంఘటనలకు ప్రతిస్పందనగా అట్లాంటాలో TANA టీమ్ స్క్వేర్‌ ద్వారా ఎంతో సహాయం అందించారు. అట్లాంటాలో జరిగిన ATA మరియు NATA సమావేశాల సలహా మండలిలో పనిచేశారు. తానా బ్యాక్ ప్యాక్ ప్రోగ్రాం కి ఎన్నో ఏళ్లుగా స్పాన్సర్ చేసి సహకరిస్తున్నారు. 2009 లో ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల కోసం క్లోతింగ్ డ్రైవ్ ద్వారా 10 వేల పౌండ్ల దుస్తులు సేకరించారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో అట్లాంటా కమ్యూనిటీలో 900 కోవిడ్ టెస్టింగ్ కిట్‌లను స్పాన్సర్ చేసి పంపిణీ చేశారు. తెలుగు ఎట్ ఎమోరీ అవగాహన కార్యక్రమంతో సహా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. అట్లాంటాలో చిన్నారుల కోసం 400 మందితో బాలల సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఎన్నారై టీడీపీ అట్లాంటా మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అట్లాంటాలో ఎన్టీఆర్ సెంటెన్నియల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ సుమారు 2500 ఆహ్వానితులలో అత్యంత ఘనంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలలో ఆయన సహాయ సహకారాలు అందించి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు.

వివిధ సేవాకార్యక్రమాల కోసం మరియు వివిధ సంస్థల మహాసభల కోసం ఇప్పటి వరకు దాదాపు 1.5 మిలియన్ డాలర్లు రైజ్ చేశారు. తనకు జన్మనిచిన మాతృభూమికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూనే, తనకు జీవికను ఇచ్చిన ప్రాంతం కోసం ఏదైన చేయాలన్న తపనతో అట్లాంటాలో బ్లడ్ డ్రైవ్‌లు, హెల్త్ ఫెయిర్‌లు మరియు బోన్ మ్యారో డ్రైవ్‌లు వంటి అనేక సేవా కార్యక్రమాలకు తోడ్పడ్డారు.

మొత్తంగా వివిధ నాన్-ప్రాఫిట్ సంస్థలకు 5 లక్షల డాలర్లకు పైగా విరాళాలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. 2022 లో తానా-బసవతారకం ప్రాజెక్ట్ కోసం నిధులు సమీకరించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2019, 2017 మరియు 2015 లో వాషింగ్టన్ DC, సెయింట్ లూయిస్ మరియు డెట్రాయిట్‌ కన్వెన్షన్స్ కి నిధులు సమీకరించి TANA మహాసభలు నిర్వహించడం లో సహకరించారు.

ఫిలడెల్ఫియాలో 2023 తానా సదస్సు కోసం మిలియన్ డాలర్స్ రైజ్ చేశారు. ఇది ఆయన పట్టుదలను, కష్టించే గుణాన్ని సూచిస్తుంది. మాటలతో మాత్రమే సరిపెట్టకుండా, చేతలతో ఎంతో మందికి చేయూతనందించి వారిని కష్టాలనుండి గట్టెక్కించిన ఘనత మన శ్రీనివాస్ లావు గారికే దక్కుతుంది.

ఎంత ఎత్తు ఎదిగినా విధేయతతో ఉండడం ఆయన వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ప్రగతిదాయక దృక్పథంతో దూసుకుపోతూ, ప్రతీ మలుపులోనూ మైలు రాళ్ళను నెలకొల్పుతున్నారు. సుదూర లక్ష్యాలను సాధించేందుకు ఇంకెంతో చేయాలనే సత్సంకల్పంతో నిస్వార్ధంగా సేవలందిస్తున్న తనని TANA Board Of Director గా, అలాగే టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected