Connect with us

News

Srinivas Kukatla: తానా ఫౌండేషన్‌ లక్ష్యం, నా లక్ష్యం ఒక్కటే

Published

on

తెలుగు కమ్యూనిటీకి తానా ఫౌండేషన్‌ (TANA Foundation) సేవలను మరింతగా విస్తృతం చేయడంతోపాటు, జన్మభూమి సేవలో తానా ప్రాధాన్యాన్ని పెంచేందుకు కృషి చేయాలన్న లక్ష్యంతో తానా (TANA) ఫౌండేషన్‌ ట్రస్టీ (2023-27) గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.

తానా ఫౌండేషన్‌ సభ్యునిగా గెలిపించండి, తానా సేవలను మరింత విస్తృతంగా నిర్వహించే అవకాశం ఇవ్వండి. అలాగే టీం కొడాలి (Team Kodali) ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికీ ఓటు వేసి గెలిపించవలసిందిగా తానా సభ్యులను కోర్చుతున్నాను.

శ్రీనివాస్ కూకట్ల సేవా కార్యక్రమాలు

  • తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న పిల్లల హృద్రోగ చికిత్స శిబిరాల నిర్వహణ
  • తానా బసవతారకం ప్రాజెక్టుకు విరాళం
  • బొబ్బిలి లో మాత్రుశ్రీ వ్రుద్దాశ్రమం నిర్మాణానికి చేయూత
  • కంటి చికిత్స శిబిరం, క్యాన్సర్‌ శిబిరం
  • డిసి మెట్రో ఏరియాలో బోన్‌మారో డ్రైవ్మ‌
  • క్యాపిటల్‌ ఏరియాలో సిపిఆర్‌ ట్రైనింగ్ వర్క్‌షాప్‌
  • మేదరమెట్ల హైస్కూల్‌లో 1000 లీటర్ల ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు
  • తిమ్మాయపాలెం జడ్‌పి హైస్కూల్‌ మౌళిక సౌకర్యాల అభివృద్ధి
  • రైతులకు పవర్‌ స్ప్రేయర్ల పంపిణీ, రైతు రక్షణ పరికరాల పంపిణీ
  • రగ్గులు, ట్రై సైకిళ్ళ పంపిణీ
  • చేయూత స్కాలర్‌ షిప్‌ల పంపిణీ
  • మెడికల్‌ స్టూడెంట్‌కు ల్యాప్‌ టాప్‌ బహుకరణ

శ్రీనివాస్ కూకట్ల నిర్వహించిన పదవులు

2021-23 తానా ఈవెంట్స్‌ కో ఆర్డినేటర్‌

2019-21 క్యాపిటల్‌ రీజియన్‌ తానా కేర్స్‌ అడ్‌హాక్‌ కమిటీ

2017-19 తానా ఐటీ బిజినెస్‌ ఇస్యూస్‌ కమిటీ

2015-17 తానా తెలుగు స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్‌ కమిటీ

2015-16 మేరీలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ తొలి ప్రెసిడెంట్‌

శ్రీనివాస్ కూకట్ల లక్ష్యాలు

  • తానా ఫౌండేషన్‌కు ఇచ్చే విరాళాలను అవసరమైన వారికి అందించేలా చూడటం
  • జన్మభూమికి, కమ్యూనిటీకి నావంతుగా, తానా ఫౌండేషన్‌ తరపున సేవలందించడం

error: NRI2NRI.COM copyright content is protected