Connect with us

Donation

తానా & టీమ్ ఫౌండేషన్: సన్నకారు రైతుకి ట్రాక్టర్ & సేద్య పరికరాల పంపిణి – Srinivas Abburi

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు టీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమంలో భాగంగా సన్నకారు రైతుల సహయార్థం వికలాంగ రైతు కు చేయూత నిచ్చారు. టీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఎన్నారై శ్రీనివాస్ అబ్బూరి ఈ సహాయాన్నందించారు.

వివరాలలోకి వెళితే..వినుకొండలోని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన దివ్యంగ రైతు శ్రీనివాసరావు పాలడుగు ఎకరం భూమి సాగు చేస్తూ ఇద్దరు ఆడకూతుళ్ళను చదివిస్తున్నారు. వైకల్యం అడ్డుకోకుండా ఆసరాగా ఉంటుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు చేతుల మీదగా కొత్తపేటలో శ్రీనివాస్ అబ్బూరి ట్రాక్టర్ తాళం అందచేశారు.

అమెరికాలోని సియాటిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, వాషింగ్టన్ తెలుగు సమితి అధ్యక్షునిగా, ఎన్నారై టిడిపి కమిటీ సభ్యునిగా సేవలందిస్తున్న శ్రీనివాస్ అబ్బూరి గత జనవరిలో కూడా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ల్యాప్టాప్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ఇంకా టిడిపి నాయకులు నాగేశ్వరరావు పెమ్మసాని, సుబ్బారావు ముండ్రు, వెంకట నారాయణ పెసల, రామయ్య అబ్బూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు శ్రీనివాస్ అబ్బూరి ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected