Connect with us

Social Service

హైటు, వెయిటు, గంభీరం, ఆప్యాయత, కలుపుగోలుతనమే శ్రీధర్ తిరుపతి సామర్ధ్యం

Published

on

మనిషిని చూస్తే మంచి హైటు, వెయిటు ఉంటాడు. కొంచెం గంభీరంగా ఉంటాడు. అన్న అన్న అంటూ అటు పెద్దలను ఇటు చిన్నలను ఆప్యాయంగా పలకరిస్తాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోపాన్ని చిరు నోముపై కనపడనివ్వడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా, టెన్షన్ పక్కన పెట్టి కలుపుగోలుతనంతో పరిష్కారం కోసం చూస్తాడు.

అతడే శ్రీధర్ తిరుపతి (Sridhar Tirupati) ఫ్రమ్ అట్లాంటా. ఈ మధ్యనే విజయవంతంగా ముగిసిన అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 18వ మహాసభల కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం 2025-28 కాలానికి లైఫ్ కేటగిరీలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా (ATA Board of Trustee – Life Category) పోటీచేస్తున్నారు.

అట్లాంటా (Atlanta) లో నిర్వహించిన ఆటా 18వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గా, యాడ్ హాక్ కమిటీ మెంబర్ గా, బడ్జెట్ కమిటీ కోచైర్ గా, 15వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ సెక్యూరిటీ కమిటీ అడ్వైజర్ గా, మిగతా కన్వెన్షన్స్ కి కార్పొరేట్ స్పాన్సర్షిప్ కమిటీ ఛైర్మన్ గా, కో ఛైర్మన్ గా శ్రీధర్ తిరుపతి అనేక సేవలందించారు.

2012 నుండి ఆటా (American Telugu Association – ATA) వేడుకలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న శ్రీధర్ తిరుపతి (Sridhar Tirupati) ఆటా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా మరియు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా, కోచైర్ గా తనదైన పంధాలో కార్పొరేట్ లెవెల్ లో ఆటా కి సత్సంబంధాలు ఏర్పరిచారు.

ఆటా అట్లాంటా చాప్టర్ (ATA Atlanta Chapter) కోర్ మెంబర్ గా ఫుడ్ డ్రైవ్స్, క్రీడా కార్యక్రమాలు, ఉమెన్స్ డే, ఎడ్యుకేషనల్ సెమినార్స్, బ్లడ్ డ్రైవ్స్, కల్చరల్ ఈవెంట్స్ వంటి కార్యక్రమాలలో తనదైన పాత్ర పోషించారు. ఇంకా మరెన్నో కమ్యూనిటీ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు.

దాతగా ఇతర స్థానిక మరియు జాతీయ తెలుగు సంఘాలకు తనదైన సాయం చేస్తూనే ఉన్నారు. మంచి ఫిలాంత్రపిస్ట్ (Philanthropist) గా పేరున్న శ్రీధర్ తిరుపతి, అట్లాంటా (Atlanta) ప్రాంతం నుంచి దాదాపు హాఫ్ ఏ మిలియన్ ఫండ్స్ రైజ్ చేయడంలో తన ప్రతిభను చాటారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో మిలియన్ మీల్స్ (Million Meals) ప్రోగ్రాం నిర్వహించారు.

సౌమ్యునిగా, సామాజిక స్పృహ కలిగిన నేతగా పేరున్న శ్రీధర్ తిరుపతి (Sridhar Tirupati) కి ప్రస్తుతం జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఎలక్షన్స్ లో లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రవాస తెలుగువారు కోరుతున్నారు.

ఆటా (American Telugu Association – ATA) నామినేషన్ కమిటీ (Nomination Committee) డిసెంబర్ 2న ఫస్ట్ క్లాస్ పోస్ట్ ద్వారా పంపిన బాలట్స్ ని వోట్ వేసి అందరూ డిసెంబర్ 20వ తేదీ లోపు తిరిగి ఆటా కి అందేలా పంపాలని మనవి చేస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected