Hamburg, Germany: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) సంయుక్త సహకారంతో శ్రీ వేంకటేశ్వర మందిర్ హాంబర్గ్ ఇ. వి మరియు మన తెలుగు హాంబర్గ్ అసోసియేషన్ (Mana Telugu Hamburg Association e.V) ఆధ్వర్యంలో హాంబర్గ్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం టీటీడీ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లయ్య గారి పర్యవేక్షణలో టీటీడీ (TTD) అర్చక స్వాముల బృందం సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలతో ఆరంభించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో మంగళవాయిద్యాల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కళ్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు, తమిళ్, కన్నడ మరియు ఇతర రాష్ట్రాల భక్తులు పాల్గొని, స్వామి-అమ్మవారికళ్యాణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.అనంతరం భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం మరియు కళ్యాణ ప్రసాదాన్ని అందించారు.“హాంబర్గ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ కళ్యాణోత్సవం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం మా భాగ్యం” అని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కృపతో భక్తులందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీ వేంకటేశ్వర మందిర్ హాంబర్గ్ ఇ. వి (Sri Venkateswara Mandir Hamburg e.V).
మరియు మన తెలుగు హాంబర్గ్ అసోసియేషన్ (మాతా ఇ. వి.) ప్రతినిధులు డా. శివ శంకర్ లింగం , శ్రీనివాస్ వడ్డాది, శశిధర్ ఏమిరెడ్డి, సంతోష్ కె. నీలం, శివ కోలా, వెంకటేసులు నరెడ్డుల, సాగర్ మీశాలఅభిలాష్ మోరేశ్వర్, స్వాతి మాసెట్టి, సాయి చరణ్, రవి తేజ, దినేష్ పాకలపాటి, పల్లవి పప్పల, శ్రావంతి కనపర్తి, నాగమణిమాధవన్ & రాజేష్ – ప్రసాద్ టీమ్ అవిశ్రాంతంగా కృషి చేశారు.
ఈ కళ్యాణోత్సవం లో జర్మనీ (Germany) దేశం లో మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్ట్ (Frankfurt) ప్రతినిధులు టిట్టు మద్దిపట్ల, సూర్య వెలగా పాల్గొన్నారు.యూరప్ ప్రధాన కోఆర్డినేటర్ డా. కిషోర్ బాబు చలసాని సారధ్యంలో డా. శ్రీకాంత్, సుమంత్ కొర్రపాటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతం గా సమన్వయం చేయడం లో కీలక పాత్ర పోషించారు.