Connect with us

Donation

శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్ @ Dallas, Texas: రక్తదాన శిబిరం విజయవంతం

Published

on

Dallas, Texas: శ్రీప్రణవపీఠం (Pranava Peetam) వ్యవస్థాపకులు, త్రిభాషామహాసహస్రావధాని శ్రీవద్దిపర్తి పద్మాకర్ (Vaddiparti Padmakar) గారి ఆశీస్సులతో వారి శిష్యులు అమెరికాలోని డల్లాస్‌ (Dallas) లో “శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్” (Vaddiparti Padmakar Foundation) తరఫున కార్టర్ బ్లడ్ కేర్ (Carter BloodCare) తో కలిసి జనవరి 18వతేదీ న నిర్వహించిన రక్తదాన (Blood Donation) కార్యక్రమం అత్యంత విజయవంతమైంది.   

ఫ్రిస్కో (Frisco) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swami Temple) ఆలయం వేదికగా జరిగిన ఈ డ్రైవ్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. 33 కన్నా ఎక్కువ మంది దాతలు రావటంతో కార్టర్ బ్లడ్ కేర్ కొంతమంది దాతలను వెనుకకు పంపాల్సివచ్చింది.  ఉదయం 9.30 నిలకు మొదలైన రక్తదాన కార్యక్రమం మద్యాహ్నం 1.30 ని.ల వరకు జరిగింది.

అమెరికాలో, టెక్షాస్ (Texas) రాష్ట్రం Dallas లో నెలకొల్పబడిన “శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్” (Vaddiparti Padmakar Foundation) తరపున సత్సంగ సభ్యులందరూ ఏకగ్రీవంగా కలిసి ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చారు. రక్తదానం (Blood Donation) చేయలేని వారు కూడా తమ పూర్తి సహాయసహకారాలు అందించి సేవా బాధ్యతలను స్వీకరించారు.  

error: NRI2NRI.COM copyright content is protected