Connect with us

Devotional

TCA ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలతో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం @ Canada, Toronto

Published

on

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association – TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో (Greater Toronto) నగరంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం టొరంటో కాలిబారి దేవాలయంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ కళ్యాణోత్సవాన్ని TCA ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం (Srinivas Mannem) అధ్యక్ష్యతన, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు మరియు కమిటీ కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి నిర్వహణలో, తెలంగాణ కెనడా సంఘం (TCA) పాలక మండలి సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పురోహితులు శ్రీ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల (Vedic Chants) మధ్య శ్రీ రామాభిషేకంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. అనంతరం పండితులు ఉత్సవ మూర్తులను అలంకరించి, కల్యాణానికి విచ్చేసిన దంపతులతో సంకల్పం చేయించారు.

ఆ తరువాత శాస్త్రోక్తంగా గణపతి (Lord Ganesh) పూజతో కళ్యాణం ప్రారంభించగా, వేద మంత్రోచ్ఛారణల నడుమ, భక్తుల ఘన సమక్షంలో శ్రీ సీతారామ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తదనంతరం భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు.

కల్యాణానంతరం భక్తులు శ్రీ హనుమత్సితాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు పానకం, వడపప్పుతోపాటు భద్రాచలం (Bhadrachalam) నుండి ప్రత్యేకంగా సమకూర్చిన లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ వేడుకలో షుమారు 500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికీ రుచికరమైన పండుగ భోజనాన్ని ఏర్పాటు చేసారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (Telangana Canada Association – TCA) అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ.. వరుసగా మూడవ సంవత్సరం నిర్విఘ్నంగా శ్రీ సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించగలిగినందుకు వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఏటేటా భక్తుల ఆదరణ మరింతగా పెరుగుతూ ఉండటం తమకు విశేష సంతోషాన్ని కలిగించడమే కాకుండా, టీసీఏ కార్యనిర్వాహక కమిటీకి మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తున్నదని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను జరుపునేందుకు ముఖ్యకారకులైన TCA స్పాన్సర్స్ ప్రవీణ్ చిమట గారికి, మరియు Sundyne సంస్థకు కృతఙ్ఞతలు తెలియజేసారు.

ఉత్సవానికి ప్రత్యేకారకర్షణగా నిలిచిన లడ్డూ ప్రసాదం సమకూర్చినందుకు భద్రాచలం (Sita Ramachandraswamy) దేవస్థానం కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షులు శ్రీ శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రణీత్ పాలడుగు, కోశాధికారి శ్రీ రాజేష్ అర్ర పాల్గొన్నారు.

అలాగే టీసీఏ డైరెక్టర్లు శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శ్రీ శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీ పవన్ కుమార్ పెనుమచ్చ, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు కూడా పాల్గొని విజయవంతం చేశారు.