Connect with us

News

న్యూ జెర్సీ బుడతడు శ్రీ నిహాల్‌ తమ్మన కు ప్రిన్సెస్ ‌డయానా అవార్డ్

Published

on

అమెరికాలో తెలుగు విద్యార్ధికి అరుదైన గౌరవం లభించింది. సమాజంలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచించే యువతకు అమెరికాలో ప్రిన్సెస్ డయానా అవార్డ్‌తో సత్కరిస్తారు. అమెరికాలో తెలుగు విద్యార్ధి శ్రీ నిహాల్ తమ్మన పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి ఫలితంగా ఈ అవార్డ్ వరించింది.

సమాజం కోసం ఆలోచించి మానవత్వంతో స్పందించిన నిహాల్ తమ్మన బ్యాటరీలు ఈ పర్యావరణానికి ఎంత కీడు చేస్తున్నాయనేది చదువుకుని చలించిపోయాడు. దీనికి రీ సైకిలింగ్ ఒక్కటే మార్గమని భావించి బ్యాటరీ రీసైకిలింగ్‌ని చిన్న వయస్సులోనే ఓ ఉద్యమంలా చేపట్టాడు.తన తోటి విద్యార్ధుల సాయంతో ముందుగా ఇళ్లలో వినియోగించిన బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించారు.

ఇప్పటివరకు దాదాపు 2,75,000 బ్యాటరీలను నిహాల్ రీసైకిలింగ్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. బ్యాటరీ రీసైకిలింగ్‌పై బడుల్లో అవగాహన సదస్సలు నిర్వహించారు. ఈ సదస్సుల ద్వారా దాదాపు కోటి మందిని పైగా చైతన్యం చేశారు. అతి చిన్న వయస్సులోనే ఇలా పర్యావరణం గురించి ఆలోచించి దాని కోసం అకుఠింత కార్యదీక్షతో పనిచేస్తున్న శ్రీ నిహాల్ తమ్మన కు ఇప్పటికే అనేక అవార్డులు వరించాయి.

ఇప్పుడు తాజాగా ప్రిన్సెస్ డయానా అవార్డు శ్రీ నిహాల్‌ కృషికి మరింత గుర్తింపు తెచ్చింది. 13 ఏళ్ల తెలుగు విద్యార్ధి ఇలాంటి అవార్డు సాధించడం చరిత్రలోనే మొదటిసారిగా చెప్పవచ్చు. ఇది కచ్చితంగా తెలుగువారంతా గర్వించదగ్గ విషయం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected