మార్చి 25, 26 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మినీ తెలుగు సంబరాలను మాక్స్ వినోదంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. బ్యాంక్వెట్ డిన్నర్, తెలుగు సినీ స్టార్స్, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి అందరినీ ఆకట్టుకున్నాయి.
మినీ తెలుగు సంబరాలలో రెండవరోజు అయినటువంటి మార్చి 26 శనివారం ఉదయం అల్పాహారం అనంతరం 9 గంటలకు బోర్డు సభ్యులు మరియు కార్యనిర్వాహక సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే రెండు సంవత్సరాలలో నాట్స్ చేపట్టబోయే కార్యక్రమాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కోవిడ్ బారి నుండి కోలుకున్న తర్వాత 2023 జూన్ 30 నుండి జులై 2 వరకూ 7 వ అమెరికా తెలుగు సంబరాలు న్యూజెర్సీ లోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు బోర్డ్ చైర్ ఉమన్ ఆరుణ గంటి అందరి సమక్షంలో ప్రకటించారు. ఈ 7 వ అమెరికా తెలుగు సంబరాలకు ఇమీడియట్ పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.
అనంతరం అరుణ గంటి మాట్లాడుతూ భాషే రమ్యం, సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా ఎప్పటిలాగే తెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రవాస తోటి తెలుగువారికి అవసరమైనప్పుడల్లా ముందుండి సహాయపడుతూ, పలువురు కొత్త సభ్యులను నాట్స్ అభివృద్ధి లో భాగస్వామ్యులుగా చేసుకొంటూ ముందుకు సాగాలని అన్ని చాఫ్టర్లకూ పిలుపునిచ్చారు.