Connect with us

Sports

‘రైతు కోసం తానా’ నిధుల కొరకు క్రీడా పోటీలు, TANA Austin Chapter ఆధ్వర్యంలో విజయవంతం

Published

on

Austin, Texas: ఆస్టిన్‌ తానా (TANA) ఆధ్వర్యంలో సెడార్ పార్క్‌లో తెలుగు వారిచే నిర్వహించిన TopShot స్పోర్ట్స్ క్లబ్‌లో “రైతు కోసం తానా” కార్యక్రమం లో భాగంగా జరిగిన క్రీడా పోటీలు అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని తానా సౌత్‌వెస్ట్ ప్రతినిధి సుమంత్ పుసులూరి (Sumanth Pusuluri) ఆస్టిన్ తానా సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఆస్టిన్ TANA (Telugu Association of North America) సభ్యులైన చిరంజీవి ముప్పనేని, సూర్య ముళ్ళపూడి, బాలాజీ పర్వతనేని, సాయి మువ్వా, తేజ వుడత, ఉదయ్ మేక, లెనిన్ ఎర్రం, ప్రసాద్ కాకుమాను, శ్రీధర్ పోలవరపు, మరియు సదా చిగురుపాటి కృషి అమోఘం.

ఆస్టిన్ (Austin, Texas) తానా సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు వీరి నిరంతర సహకారం మరియు కృషికి సుమంత్ పుసులూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పోటీల్లో 100 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా బ్యాడ్మింటన్ (Badminton), పికిల్‌బాల్ మరియు టేబుల్ టెన్నిస్ (Table Tennis) పోటీల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా Hashtag India మరియు GuruTaxPro సంస్థలు అందించిన సహాయం మరువలేనిది. ఈ సంస్థల ప్రతినిధులు బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ (Pickleball), మరియు టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌లో విజేతలు మరియు రన్నరప్‌లకు ట్రోఫీలు అందజేసి, క్రీడాకారుల ప్రతిభను అభినందించారు.

ఆస్టిన్ (Austin, Texas) తానా కోఆర్డినేటర్ సుమంత్ పుసులూరి (TANA Southwest Regional Coordinator) ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజేతలు, స్పాన్సర్లు, మరియు వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్రీడా పోటీల (Sports Competitions) కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులు రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) రైతుల సంక్షేమం కోసం వినియోగించబడతాయని తెలిపారు. “రైతు కోసం తానా” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి సహకారంతో అద్భుతంగా జరిగింది అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected