Connect with us

Community Service

సంఘసేవలో ఉక్కు మహిళ; అట్లాంటా వాసి Sohini Ayinala

Published

on

నిరంతర సేవా నిరతి, అంకితభావం మహనీయులకు ఉండే అద్భుతమైన లక్షణాలు. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి, అట్లాంటా వాసి శ్రీమతి సోహిని అయినాల (Sohini Ayinala) గారు 1990 నుండి తానా (TANA) కార్యక్రమాలకు తనవంతుగా సాయం చేస్తున్నారు.

అట్లాంటాలో జరిగిన 8వ తానా సదస్సు లో యువ వాలంటీర్‌గా హాస్పిటాలిటీ టీమ్‌లో చురుకుగా పనిచేశారు. అట్లాంటాలోని శివ మందిరం, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (Hindu Temple of Atlanta) మరియు వివిధ సంస్థలకు విరాళాలు అందించారు.

2011 మరియు 2012 లో అట్లాంటాలో 300 మందికి పైగా పిల్లలతో బాలల సంబరాలు నిర్వహించి, చదరంగం పోటీలు, వ్యాపారం మరియు పబ్లిక్ స్పీకింగ్ సెమినార్లు నిర్వహించారు. 2014 లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆడిట్ కమిటీకి అధ్యక్షురాలిగా బాద్యతలు నిర్వర్తించారు.

2013 NRIVA (NRI Vasavi Association) కన్వెన్షన్‌లో బాంక్వెట్ కో-ఛైర్‌గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను 5000 మందికి పైగా ఆహ్వానితులతో విజయవంతంగా నిర్వహించారు. 2014 NATA (North America Telugu Association) కన్వెన్షన్‌లో ఉమెన్స్ ఫోరమ్ కో-చైర్‌గా ఫ్యాషన్ షో నిర్వహించారు.

ధీమ్‌తానా (DhimTANA) కోసం మొట్టమొదటి సభ్యులలో ఒకరిగా, స్థానిక తానా (TANA) బృందం సహకారంతో 2015, 2017, 2019 మరియు 2023 లో అట్లాంటాలో ధీమ్‌తానా పోటీలను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో తానా కళాశాల బృంద కార్యాచరణకు ఎంతో తోడ్పడ్డారు.

ATA అట్లాంటా (Atlanta) కన్వెన్షన్ 2024 హాస్పిటాలిటీ హై డోనర్ కమిటీకి చైర్‌గా అధిక దాతలకు వ్యక్తిగత దాత ప్యాకేజీలను అందించడానికి ఒక బృందాన్ని సృష్టించారు. అన్ని సంస్థల మద్దతుతో 2023లో అట్లాంటాలో ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose) ఈవెంట్‌ని హోస్ట్ చేసి స్పాన్సర్ చేసారు.

ధీమ్‌తానా (DhimTANA) 2023 కో-ఛైర్‌గా, మొత్తం 12 నగరాల్లో 416 మంది పాల్గొన్న DhimTANA పోటీలను నిర్వహించడానికి అవసరమైన నిధులను సేకరించి తానా చరిత్రలో మొదటిసారి – ధిమ్‌తానా వెబ్‌సైట్‌ను రూపొందించి పాల్గొనేవారికి, విజేతలకు అలాగే కలాశాల ఉపాధ్యాయులకు ట్రోఫీలు, ఫలకాలు అందించి చరిత్ర సృష్టించారు.

అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి, తానున్న ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేసారు. “చిల్డ్రన్ హెల్త్‌కేర్ ఆఫ్ అమెరికా”, “హోసియా ఫీడ్ ది హంగ్రీ అండ్ హోమ్‌లెస్”, “MSG ఫౌండేషన్”, “అమెరికన్ రెడ్‌క్రాస్”, “అగరం ఫౌండేషన్” వంటి USA మరియు భారతదేశంలోని వివిధ లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలతో స్థానిక కమ్యూనిటీలో చురుకైన వాలంటీర్ మరియు దాతగా వ్యవహరించారు.

ఔట్‌రీచ్ కమిటీ చైర్‌గా మరియు కో-ఆర్డినేటర్‌గా – బ్లడ్ డ్రైవ్‌లు, బోన్ మ్యారో డ్రైవ్‌లు, టాయ్స్ ఫర్ టోట్స్ డ్రైవ్‌లు, మెడికల్ క్యాంపులు, హెల్త్ ఫెయిర్‌లు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణ స్థాయినుంచీ అసాధారణ స్థాయికి చేరిన వారు ఎందరికో మార్గదర్శకులవుతారు.

వారు చూపిన బాటలో ఎంతోమంది నడుస్తూ విజయతీరాలకు తాకి శిఖరాగ్రాలకు చేరుకుంటారు. అలాంటి ఓ మార్గదర్శి, దిశా నిర్దేశకులు శ్రీమతి Sohini Ayinala గారు అంటే అతిశయోక్తి కాదు. 2020-22 WETA (Women Empowerment Telugu Association) బోర్డు సభ్యునిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కుట్టు మిషన్లు, శానిటరీ ప్యాడ్‌లు, ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రొజెక్టర్లు, వెంటిలేటర్లు, కోవిడ్ కిట్లు, మాస్క్‌లు మరియు ఆహారం పంపిణీ చేసారు.

లైంగిక వేధింపులు, గృహ హింస, పని ప్రదేశాల వేధింపులకు గురవుతున్న ఎన్‌ఆర్‌ఐ మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) మరియు కౌన్సెలింగ్ సేవలు అమలు పరిచారు. సత్సంకల్పం, దృఢమైన ఆశయం రెండూ కలగలిపి వాటికీ ఓ రూపం ఇస్తే.. ఆమే శ్రీమతి Sohini Ayinala గారు అనడంలో సందేహం లేదు.

అలాంటి సోహిని అయినాల (Sohini Ayinala) గారు ప్రస్తుత తానా (Telugu Association of North America) ఎన్నికల్లో తానా Women Services Coordinator గా పోటీ చేస్తున్నారు. తనతోపాటు తన టీం కొడాలి జట్టులోని ప్రతి ఒక్కరికీ ఓటు వేసి గెలిపించవలసిందిగా అభిలషిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected