Connect with us

Business

Atlanta NRI స్వప్న కాస్వ SKT గోల్డ్ & డైమండ్స్ షాప్ @ Hyderabad, హీరోయిన్ శ్రియ శరణ్ ఓపెనింగ్

Published

on

Hyderabad, Telangana: హైదరాబాద్ మహా నగరంలో ఎస్ కె టీ గోల్డ్, డైమండ్స్, సిల్వర్ షాప్ ప్రారంభం కానున్నది. జూబ్లీహిల్స్‌లో మార్చి 29వ తేదీన ఈ సరికొత్త షాప్ ని వైభవంగా ప్రారంభించనున్నారు. ఈ మెగా షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి శ్రియ శరణ్ (Heroine Shriya Saran) ఆదివారంనాడు ప్రారంభించనుండడం విశేషం.

మధ్యాహ్నం 12:06 గంటలకు ఈ షాపు ప్రారంభమవుతుందని అట్లాంటా (Atlanta, Georgia) కు చెందిన స్వప్న కస్వ తెలిపారు. అమెరికాలోని అట్లాంటా ప్రాంతం నుండి ఇండియాకి తిరిగి వచ్చిన స్వప్న కాస్వ వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. GATA, GTA వంటి ప్రముఖ తెలుగు సంఘాలలో స్వప్న కాస్వ పని చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలు, అద్భుతమైన డిజైన్లతో బంగారం (Gold) మరియు వజ్రాభరణాలను (Diamonds) నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను తీర్చిదిద్దారు. సంప్రదాయ మరియు ఆధునిక శైలి కలబోతగా ఉండే ప్రత్యేక కలెక్షన్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ SKT గోల్డ్ & డైమండ్స్ షాప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఎన్నారైలు (NRI) స్వప్న కాస్వ (Swapna Kaswa) కు అభినందనలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected