అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల మే 8 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ తరపున నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల పలువురు మాతృమూర్తులకు చీరలు బహుకరించారు. కొన్ని వారాల క్రితం శిరీష సెలవుపై అమెరికా నుండి ఇండియా వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నెల మే 8 న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కొణిజెర్ల మండలంలోని తన స్వగ్రామం లింగ గూడెం లో తన కుటుంబ సభ్యులతో కలిసి 300 మంది మాతృమూర్తులకు చీరలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకట రమణ, టిఆర్ఎస్ నాయకులు చీకటి రామారావు, దారా అప్పారావు , మిట్టపల్లి పాండు రంగారావు, మిట్టపల్లి మురళి, మిట్టపల్లి రాంబాబు, పాండురంగారావు శ్రీమతి పాల్గొన్నారు.
అలాగే కొత్తగూడెంలోని మంగ్యా తండాలో నిర్వహించిన మరో కార్యక్రమంలో తానా తరపున శిరీష 200 మంది మాతృమూర్తులకు చీరలు అందించారు. ఈ సందర్భంగా హాజరైన నాయకులు మాట్లాడుతూ మాతృ దినోత్సవం సందర్భంగా మంచి ఆలోచనతో సమయాను సందర్భంగా వందల మంది మాతృమూర్తులకు చీరలు బహుకరించడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా మహిళలు ఆప్యాయంగా తమ గురించి అలోచించిన శిరీష మంచి మనస్సును కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన తానా లీడర్షిప్ అంజయ్య చౌదరి లావు, వెంకట రమణ యార్లగడ్డ, జయ్ తాళ్లూరి, నిరంజన్ శృంగవరపు మరియు శిరీష అన్నయ్య సురేష్ మిట్టపల్లి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.