Connect with us

Competitions

నవలా రచనను ప్రోత్సహించేలా జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల’ పోటీ 2025

Published

on

సాహితీ బంధువులందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికిగాను జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక  ‘సిరికోన నవలల’ పోటీ నిర్వహిస్తున్నారు. అంశం: “మారుతున్న విలువలు, చదువులు, తల్లిదండ్రుల బాధ్యత, యువత నేపథ్యం”. ఉత్తమ నవలకు నగదు పురస్కారం ₹40 వేల రూపాయలు. అర్హమైన ఇతర నవలలకు యథోచిత ప్రత్యేక పురస్కారాలు.

రచనల సమర్పణకు ఆఖరు తేదీ 2026, మార్చి 1 (ఆదివారం). పైనతెలిపిన ఇతివృత్తంపై, సిరికోన నవలల పోటీకై ‘రాసే’ నవలలు మాత్రమే పోటీకి అర్హం. ఈ పోటీ ఉద్దేశ్యం వస్తు వైవిధ్యంతో తెలుగులో మంచి నవలల రచనను ప్రోత్సహించటమే. ఇతర వివరాలకు, సులభంగా మీకు అందుబాటులో ఉంచుతూ, శీఘ్ర సూచనకు పైన వున్న పోటీ వివరాల పత్రిక చూడండి.

సాహితీ మిత్రులకు వినతి

ఈ సమాచారాన్ని మీకు తెలిసిన రచయిత మిత్రులకు, మీకు అవకాశమున్న ఇతర రచయితల వాక్స్థలి సమూహాలకు తెలియజేయవలసిందిగా, పోటీకి నవలా రచన చేయడానికి మీ మిత్రులను ప్రోత్సహించ వలసిందిగా అభ్యర్థిస్తున్నారు. రచయిత్రి(త) మిత్రులందరూ పోటీలో పాల్గొనవలసిందిగా ప్రత్యేక అభ్యర్థన.

error: NRI2NRI.COM copyright content is protected