Connect with us

Kids

తెలుగు మేళవింపుగా సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగ @ Buffalo Grove, Chicago

Published

on

Buffalo Grove, Chicago: తెలుగు భాష ను ఖండాతరాలలో ఉన్న తెలుగు వారి పిల్లలకు నేర్పించి భాషా సేవే భావితరాల సేవ అనే నినాదంతో సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi) గత 17 సంవత్సరాలుగా లక్ష కు పైగా విద్యార్థులకు తెలుగు నేర్పించడంలో సఫలీకృతం అయ్యింది. సిలికానాంధ్ర మనబడి బఫెలో గ్రోవ్ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే పిల్లల పండుగ ఈ నెల మార్చ్ 17వ తారీఖున లేక్ జురిక్ మిడిల్ స్కూల్ లో కేంద్ర సమన్వయ కర్తలు వెంకట్ గంగవరపు (Venkat Gangavarapu), పావని గంగవరపు మరియు నరేంద్ర గుడపాటి ల ఆధ్వర్యం లో అట్టహాసంగా నిర్వహించారు.

మనబడి కేంద్ర సమన్వయకర్తలు (Manabadi Coordinators) మాట్లాడుతూ బఫెలో గ్రోవ్ శాఖలో 160 మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు అని చెప్పారు. మనబడి నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలైన మాట్లాట, బాలానందం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి భాస్కర్ రాయవరం (Vijaya Bhaskar Rayavaram) గారు అతిధి గా విచ్చేసి సిలికానాంధ్ర (Silicon Andhra) వారు చేస్తున్న కార్యక్రమాల మరియు తెలుగు ఆవశ్యకత గురించి వివరించారు.

తెలుగు వారంతా సాంప్రదాయక దుస్తులు ధరించి ఒక కుటుంబంగా తరలి వచ్చిన ఈ సందర్భం కన్నులకు ఇంపుకుగా ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. వివిధ తరగతులలో ఉన్న విద్యార్థులు పద్యాలు, హాస్య నాటికలు మరియు నీతి కథలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల తో అందరిని అలరించారు.

ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల ను రూపొందించి, పిల్లల చేత సాధన చేయించి, ప్రదర్శింప చెయ్యటంలో చేసిన కృషి శ్లాఘనీయం. రజినీకాంత్ ఉన్నం, వెంకట్ పెరుగు, కరుణ నల్లారెడ్డి, పూర్ణిమ వేముల వ్యాఖ్యాతలు గా వ్యవహరించినారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తిగా జరిగి శ్రోతల్ని అలరించింది.

ఈ కార్యక్రమం నిర్వహణకు వెనకవుండి సహాయసహకారాలు అందించిన రమణ మల్లాది, కృష్ణ మొవ్వ, క్రాంతి కంభంపాటి, సాయి సుందరి, రమేష్ గంగవరపు, రమేష్ గోరంట్ల, రమణి గోగుల, స్వాతి అక్కినేని, దీప్తి ముసునూరు, మని వేమూరి, అన్నపూర్ణ కాలనాధభట్ట మరియు ఇతర నిర్వాహక బృందానికి పావని గంగవరపు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected