2022-23 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలో లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లో నేడే నమోదు చేయండి. సెప్టెంబర్ 10 నుండి తరగతులు మొదలవును. భాషాసేవయే భావితరాల సేవ అని సిలికానాంధ్ర మనబడి బలీయమైన నమ్మకం.
2000 మంది భాషాసైనికులతో 10 దేశాలలో అత్యధికంగా 250 కేంద్రాలలో 75,000 మంది విద్యార్థులతో 15 సంవత్సరాలుగా గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల సిలికానాంధ్ర మనబడి. పకడ్బందీ పాఠ్యాంశాలతో ఇప్పటికే 65 వేల మందికి పైగా పిల్లలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారు. మనబడి విద్యార్థులు చక్కటి తెలుగు నేర్చుకోవడంతో పాటు, అద్భుత నాయకత్వ పటిమ, ఎన్నో ప్రతిభాపాటవాలతో తెలుగు వెలుగులు దిశదిశలా ప్రకాశింప చేస్తూ తరతరాల భాషాభివృద్ధికి బంగారుబాట వేస్తున్నారు.
కొంతమంది పద్యశతకాలు సైతం వ్రాస్తున్నారు. తెలుగు చదవడం, వ్రాయడంతోపాటు భారతదేశంలోని వారి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలతో తెలుగులోనే మాట్లాడడం విశేషం. అమెరికాలో 30+ రాష్ట్రాలలోని 250 కి పైగా కేంద్రాలలోనూ, కెనడా తోపాటు దక్షిణాఫ్రికా, సింగపూర్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ మొదలగు ఇతర దేశాలలోనూ సిలికానాంధ్ర మనబడి అప్రతిహాతంగా తెలుగు భాషాబోధన చేస్తోంది.
మనబడిలో చేర్పిద్దాం తెలుగు భాష నేర్పిద్దాం. నమోదు తదితర వివరాల కొరకు https://manabadi.siliconandhra.org/ మరియు ప్రశ్నలుంటే 1-844-626-BADI ని సంప్రదించండి. ప్రత్యేకించి జార్జియా లోని అట్లాంటా ప్రాంత సిలికానాంధ్ర మనబడి కేంద్రాలలో నమోదు కొరకు పై కరపత్రములో ఇవ్వబడిన ఆయా కేంద్రాల సమన్వయకర్తలను సంప్రదించండి. అలాగే మనబడిలో తెలుగు తరగతులు బోధించుటకు ఔత్సాహిక ఉపాధ్యాయ వాలంటీర్లు 770-344-9772 ని సంప్రదించగలరు