Connect with us

Telugu

తెలుగు మధుర ప్రవాహంతో అబ్బురపరిచిన సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగ @ Alpharetta, Georgia

Published

on

భాషాసేవయే భావితరాల సేవ అంటూ సిలికానాంధ్ర (Silicon Andhra) అమెరికాలోని పలు రాష్ట్రాలలో మనబడి తరగతులు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పిల్లల పండుగ అంటూ ప్రతి నగరంలోని మనబడి విద్యార్థులు తెలుగుదనాన్ని ప్రదర్శించే కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.

అటువంటి పిల్లల పండుగని ఫిబ్రవరి 10, 2024 తేదీన జార్జియా రాష్ట్రంలో దేశానా మిడిల్ స్కూల్ (Desana Middle School) లో సిలికానాంధ్ర మనబడి ఆల్ఫారెటా (Alpharetta) శాఖ వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు 200 మంది మనబడి విద్యార్థులు వివిధ ప్రదర్శనలు ఇవ్వగా, 1000 మందికి పైగా స్థానిక తెలుగు వారు హాజరయ్యి పెద్ద వేడుకలా జరుపుకున్నారు.

ముందుగా ఆల్ఫారెటా (Alpharetta) సమన్వయకర్త నగేష్ దొడ్డాక (Nagesh Doddaka) అందరిని ఆహ్వనించి మనబడి పిల్లలని వేదిక మీదకు ఆహ్వానించారు. బడిలోని అందరు పిల్లలు శోభాయత్ర కార్యక్రమంలో పాల్గొనటంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది.

అటు పిమ్మట, అట్లాంటా ప్రాంతీయ సమన్వయకర్త విజయ్ రావిళ్ళ (Vijay Ravilla), అతిథిగా విచ్చేసిన విద్యాతపస్వి మామిళ్ళ వెంకటరంగయ్యగారి లోకనాథం (విశ్రాంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్) ద్వారా, ఉపాధ్యాయుల చేతుల మీదుగా చిట్టి బాలబడి పాపలకు భాషా జ్యోతిని అందించి, మన తెలుగు భాషా జ్యోతి ఆరకుండ చేస్తున ప్రయత్నాలను ప్రసంసించారు.

అలాగే విజయ్ రావిళ్ల అట్లాంటా (Atlanta) మనబడి ప్రస్థానం, భవిష్యత్ కార్యాచరణ, తెలుగు భాష (Telugu Language) ప్రాముఖ్యత గురించి తెలియచేసారు. తదుపరి వరుసుగా అన్ని తరగతుల వారు, వారి వారి ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరించే కార్యక్రమలు ప్రదర్శించారు.

“సంక్రాంతి వచ్చింది తుమ్మెద” మరియు “తెలుగు భాష మనది” అనే నాట్యాలతో, తెనాలి రామకృష్ణ తెలివి, కాకి గుడాచరి, పిల్లి కూనలు, ముల్లు పోయి కత్తి వచ్చె, చెట్టు మీది పిట్ట, “అందంగ అలంకరించుకున్న తెలుగు” వంటి నాటికలతో, సుమతి మరియు తెలుగు బాల శతకం పద్యాలతో, చిట్టి చిట్టి మిరియాలు, చిట్టి చిలకమ్మ, అంకెల పాట వంటి పాటలతో, లలిత కళల గురించి ప్రదర్శనలతో చక్కగ పిల్లలు అందరినీ అలరించారు.

ముఖ్యంగా, చివరి అంశంగా ప్రదర్శించిన భువన విజయం, శ్రీ కృష్ణదేవరాయల భువన విజయం కళ్ళకు కట్టినట్టు ఆ కవుల ప్రతిభను దర్శింప చేసింది. అలాగే, వ్యాఖ్యాతలుగా కార్యక్రమం అంతా నడిపించిన నిఖిల విష్ణుబొట్ల, శ్రుతి చావ తమ తెలుగు ఉచ్చారణతో, పొడుపు కథలతో, చిన్న ఆటలతో అందరి మనసులను ఆకట్టుకున్నారు.

సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi) కి ప్రాంతీయంగా సహకారాన్ని అందిస్తున్న అట్లాంటా తెలుగు సంఘం (TAMA) బోర్డు చైర్మన్ శ్రీనివాస్ ఉప్పు, ప్రెసిడెంట్ సురేష్ బండారు, విద్యాశాఖ కార్యదర్శి ప్రియాంక గడ్డం మరియు వారి కార్యవర్గం బృదం ఈ కార్యక్రమానికి హాజరయ్యి మద్దతు తెలిపారు.

ఆల్ఫారెటా కార్యదర్శులైన నగేష్ దొడ్డాక, యశ్వంత్ జొన్నలగడ్డ, మృదుల ములుకుట్ల, గాయత్రి కాశీభట్ల తదితరులను అభినందించి, మనబడి ఉపాధ్యాయులందరిని శాలువాలతో మనబడి కుటుంబం సత్కరించుకొంది. ఈ వేడుకలో భాగంగా పూర్వ ప్రకాశం , ప్రభాసం విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలను అందించి పట్టభద్రులను అభినందించడం జరిగింది.

మనబడి ఆల్ఫారెటా (Alpharetta) ప్రస్తుత ఉపాధ్యాయ బృందం సభ్యులైన శ్రీరమ్య, పద్మ, సంపత్, శృతకీర్తి, అనుష, రామ్, చంద్ర, సివ, సత్య, సంధ్య, స్వాతి, సుధ, రామదస్, ప్రవీణ్, దివ్య, సువర్ణ, నాగిని, సుబ్రమణ్యం, అను, మృదుల తదితరులనువేదిక మీద ఘనంగా సత్కరించారు.

ఇంతకు ముందు బోధించిన ఉపాధ్యాయులైన నీరజ, హరిత, వేద, సురేష్, శ్రీసుధరాణి గార్లను కూడా సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకోవడనికి సహకరించిన అందరిని, ముఖ్యంగా ముందుకు వచ్చి సహయం అందించిన తల్లి తండ్రులుని యశ్వంత్ పేరు పేరునా వేడుక చివర్లో అభినందించి ధన్యవాదాలు తెలియ చేసారు.

వీరిలో ముఖ్యులు – ఫోటోలు తీసిన దయాకర్, కల్పన, మృదుల యెర్రమల్లి, మరియు ప్రియంక. అలాగే, వేదికను అలంకరించిన సునీల, స్వప్న, కీర్తి, సౌమ్యస్రీ మరియు కవిత. భాషా జ్యోతి చేసిన సునిత, భాషాసేవకుల బాడ్జెస్ చేసిన అశ్విని, భోజన ఏర్పాట్ల బృందం లావణ్య, శివ, ప్రియ, యుగంధర్, స్వేత దరం, విద్య, నవీన్, శ్రీరాం మరియు శివాజి.

Go Green నుంచి మాలిని, వారి బృందం అందరికి మంచినీళ్ళని అందించి, పర్యావరణన్ని సమ్రక్షించే సూచనలు ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల పిమ్మట అందరు సాంప్రదాయమైన విందు భోజనం ఆరగించారు. చిన్నారుల నోటినుంచి వచ్చిన తెలుగు మధుర ప్రవాహంతో, మంచి విందు భోజనంతో ఒక సాయంత్రము చాలా అందంగా, అనందంగా గడిచింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected