Connect with us

Language

తెలుగు మధుర ప్రవాహంలా Alpharetta & Dunwoody మనబడి పిల్లల పండుగ – Silicon Andhra

Published

on

Atlanta, Georgia: 2025 ఫిబ్రవరి 1వ తేదీన దేశానా మిడిల్ స్కూల్ (Desana Middle School) లో సిలికానాంధ్ర మనబడి ఆల్ఫారెటా (Alpharetta) మరియు డన్వుడి (Dunwoody) కేంద్రాల వారి పిల్లల పండుగ కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. 260 మంది పిల్లలు, వారి కుటుంబాలతో మొత్తం 1000 మంది కలిసి పెద్ద వేడుకలాగా జరుపుకున్నారు.

ఆల్ఫారెటా సమన్వయకర్త నగేష్ దొడ్డాక (Nagesh Doddaka) గారు అందరిని ఆహ్వనించి మనబడి పిల్లలని వేదిక మీదకు ఆహ్వానించారు. బడిలోని అందరు పిల్లలు శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొనటంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. అటు పిమ్మట, అట్లాంటా ప్రాంతీయ సమన్వయకర్త విజయ్ రావిళ్ళ (Vijay Ravilla) గారు, ఉపాధ్యాయుల చేతుల మీదుగ చిట్టి బాలబడి పిల్లలకు భాషా జ్యోతిని అందించి, మన తెలుగు భాషా జ్యోతి ఆరకుండా చేస్తున ప్రయత్నాలను ప్రశంసించారు.

అలాగే విజయ్ రావిళ్ల గారు అట్లాంటా (Atlanta) ప్రాంత సిలికానాంధ్ర (Silicon Andhra) మనబడి ప్రస్థానం, భవిష్యత్ కార్యాచరణ, తెలుగు భాష ప్రాముఖ్యత గురించి తెలియచేసారు. తదుపరి వరుసగా అన్ని తరగతుల వారు ముద్దు ముద్దు మాటలతో, పద్యాలతో, నృత్యాలతో, నాటకాలు మరియు ఇతర ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

కార్యక్రమాలలో భాగంగా అష్టావధానం, పల్లె వెలుగు నాట్యం, పరమానందయ్య గారి శిష్యుల కథ, రాజుగారి ఏడుగురు కొడుకులు, బహుమానం, అప్పు తీర్చిన అద్దం, ముల్లు పోయి కత్తి వచ్చె, గాలిలో ఘుమఘుమలు, చెట్టు మీద పిట్ట వంటి నాటకలతో, గుమ్మాడమ్మ గుమ్మాడి, ఇమ్ముగ చదువని నోరున్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అలాగే ఆటలంటే మాకిష్టం, ఉడుత ఉడుత / కాకి కాకి పిలల్ల పాటలు, బాలబడి-2 పాట కోతి బావకి పెళ్ళంట పాట, వారాల పాట, అంకెల పాట, దేశమును ప్రేమించుమన్న వంటి పాటలతో, భారతదేశ 28 రాష్ట్రాల వివరాలు, పండుగ (Festivals) విశేషాలు గురించి ప్రదర్శనలతో, ప్రభాసం మరియు ప్రసూనం పద్యాలు (Poems), తాత్పర్యాలతో చక్కగా పిల్లలు అందరిని అలరించారు.

ముఖ్యంగా, చివరి అంశంగా ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం ఆల్ఫారెటా (Alpharetta) ప్రభాసం, ప్రభోదం పిల్లలు, డన్వుడి (Dunwoody) ప్రమోదం పిల్లలు కలిసి కనుల పండుగగా ప్రదర్శించారు. అలాగే వ్యాఖ్యాతలుగా కార్యక్రమం అంతా నడిపించిన మనబడి పూర్వ విద్యార్థినులు శ్రుతి చావ, సహస్ర గుండ్ర, నిత్య వలివేటి తమ తెలుగు ఉచ్చారణతో అందరి మనసులను గెలుచుకున్నారు.

మనబడికి ప్రాంతీయంగా సహకారాన్ని అందిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) బోర్డు చైర్మన్ రాఘవ తడవర్తి, అధ్యక్షులు రూపేంద్ర వేములపల్లి మరియు వారి కార్యవర్గం, మనబడి కార్యదర్శులైన నగేష్ దొడ్డాక, యశ్వంత్ జొన్నలగడ్డ, సుధీర్ కోట, మృదుల ములుకుట్ల (Mrudula Mulukutla) గార్లను అభినందించి, మనబడి ఉపధ్యాయులందరిని శాలువాలతో సత్కరించారు.

మనబడి డన్వుడి (Dunwoody) ప్రస్తుత ఉపాధ్యాయ బృందం సభ్యులు ఉదయసంధ్య, పద్మావతి, మంజూష, సంధ్య, సారిక, గౌరి గార్లు, ఆల్ఫారెటా (Alpharetta) ప్రస్తుత ఉపాధ్యాయ బృందం సభ్యులు విజయలక్ష్మి, శసి, పద్మ, అనూష, విజిత, కీర్తి, రవిశంకర్, శ్రీరాం, ఉష, స్వప్న, కల్పన, సంధ్య, సుధ, గౌతం, శివ, అను, రామదాస్, ప్రియాంక, శ్రీదివ్య, ప్రవీణ్, ఐశ్వర్య, సువర్ణ, నాగిని, రాం గార్లను వేదిక మీద సత్కరించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా జరుపుకోవడనికి సహకరించిన అందరిని, ముఖ్యంగా ముందుకు వచ్చి సహయం అందించిన తల్లి తండ్రులని యశ్వంత్ (Yashwanth Jonnalagadda) పేరు పేరునా వేడుక చివర్లో అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. వీరిలో ముఖ్యులు – ఫొటోస్ తీసిన రాం, చైతన్య గార్లు, అలాగే వేదికను అలంకరించిన అను గారు, భాషా జ్యోతి మరియు భక్త ప్రహ్లాద నాటిక కోసం బ్రహ్మ మొహం, స్తంభాలు చేసిన గీత గారు, మీడియా కవరేజ్ NRI2NRI.COM.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే పనిలో భాగంగా మాలిని (Malini Devi) గారి Go Green బృందం అందరికి మంచినీళ్ళని ఎకో ఫ్రెండ్లీ (Eco-Friendly) పద్దతిలో అందించారు. ఇండియన్ ఫ్లేవర్స్ (Indian Flavors) వెంకట్ పోలాకం (Venkat Polakam) గారు ఫలహారాలు, టీ అందించగా చిరంజీవులు రాహుల్, సరోష్ పీజాలు అందించారు.

కమ్మింగ్ పట్టణ మనబడి కేంద్రాల సమన్వయ కర్తలు సుచేత కాంచనపల్లి మరియు గౌరీధర్ మాడు గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మనబడి (Silicon Andhra Manabadi) విద్యార్థులను అభినందించారు. మొత్తంగా చిన్నారుల నోటినుంచి వచ్చిన తెలుగు మధుర ప్రవాహంతో పిల్లల పండుగ చాలా అద్భుతంగా, అనందంగా జరిగింది.

తెలుగు భాషా జ్యోతి ప్రజ్వరిల్లిన జార్జియా రాష్ట్రంలోని సిలికానాంధ్ర మనబడి ఆల్ఫారెటా (Alpharetta) మరియు డన్వుడి (Dunwoody) కేంద్రాల వారి పిల్లల పండుగ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/Alpharetta Dunwoody Silicon Andhra Manabadi Kids Festival 2025 Pictures ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected