Connect with us

Students

సగర్వంగా పట్టాలందుకున్న సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు @ Atlanta Graduation Ceremony

Published

on

2024 మే 12వ తేదీన అట్లాంటాలోని (Atlanta) దేశాన మిడిల్ స్కూల్ (Desana Middle School) లో సిలికానాంధ్ర మనబడి జార్జియ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అట్లాంటా నుండి పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం (PSTU) వారి పర్యవేక్షణలో జరిగిన ప్రకాశం మరియు ప్రభాసం పరీక్షలకు హాజరై, ఉత్తీర్ణులైన 200 లకు పైగా మనబడి విద్యార్థులు, వారి కుటుంబాలు, అట్లాంటా తెలుగు భాష అభిమానులు మొత్తం 1,000 కి పైగా హాజరై పెద్ద వేడుకలాగ జరుపుకున్నారు.

సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi) అధ్యక్షులు, కులపతి అయిన శ్రీ రాజు చమర్తి గారు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (Potti Sreeramulu Telugu University) ఉపాధ్యక్షులు శ్రీ తంగెడ కిషన్ రావు గారు, విశ్రాంత ఆచార్యులు (Retired Professor) శ్రీ మునిరత్నం నాయిడు గారు సభకి ముఖ్య అతిథులగా విచ్చేసారు. మృదుల ములుకుట్ల గారు మొదట అందరిని సభకి ఆహ్వానించగా, చిన్నారులు “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” పాట పాడడంతో కార్యక్రమం (Graduation Ceremony) ప్రారంభం అయ్యింది.

అట్లాంటా (Atlanta) ప్రాంతీయ సమన్వయకర్త విజయ్ రావిళ్ళ గారు అతిథులందరికి మాతృదిన శుభాకాంక్షలు అందచేసి తన ప్రసంగంలో మనబడి పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తల్లితండ్రులు అందిస్తున్న సహకారానికి మరియు గురువుల, సమన్వయకర్తల, భాషా సైనికుల కృషిని ప్రశంసించారు. అట్లాంటా మనబడి కార్యక్రమాలను తెలియజేశారు. విచ్చేసిన ప్రముఖులను వేదిక మీదకు ఆహ్వానించారు.

శ్రీ రాజు గారు, శ్రీ కిషన్ రావు గారు ఉత్తీర్ణత పొంది పట్టాలు అందుకోబోతున్న విద్యార్థులను అభినందించి, ఆశీర్వదించారు. శ్రీ రాజు గారు తెలుగు భాషను ముందు తరానికి అందింపచేస్తున్న తల్లితండ్రులను, గురువులను, సమన్వయకర్తలను అభినందించి, అందరు తమ పరిథిలో తెలుగు భాష (Telugu Language) వ్యాప్తికి కృషి కొనసాగించాలని ఉత్తేజితులని చేసారు.

అలాగే బాల గురువులుగా మనబడిలో సహాయం చేస్తున్న పిల్లలందరిని అభినందించారు. శ్రీ కిషన్ రావు గారు శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క “ఏ దేశమేగిన ఎందు కాలిడిన” అన్న మాటలు అందరికి గుర్తు చేసి, తెలుగు భాషా వ్యాప్తి కోసం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మరియు సిలికానాంధ్ర కలిసి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

ప్రాంతీయ సహసమన్వయకర్త (Regional Coordinator) సుచేత కాంచనపల్లి గారు విద్యార్థులందరితో మనబడి ప్రతిజ్ఞ చెయ్యించారు. ప్రాంతీయ సహసమన్వయకర్త నగేష్ దొడ్డక గారు, జార్జియ (Georgia) లోని 5 కేంద్రాల (ఆల్ఫారెట, కమ్మింగ్, రివర్డేల్, డన్వుడి, మేరియెట్ట) సమన్వయకర్తలు యశ్వంత్ జొన్నలగడ్డ గారు, గౌరిధర్ మాడు గారు, శిరీష గండురి గారు, భారతి అన్నే గారు వేడుకలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.

మనబడి ప్రకాశం గురువులు: గౌరి ఈడుపుగంటి గారు (2023 డన్వుడి), సారిక బొల్లంపల్లి గారు (2024 డన్వుడి), నాగిని మాగంటి గారు (2023 అల్ఫరెట్ట), సువర్ణ అడెపు గారు (2023 అల్ఫరెట్ట), శ్రీదివ్య కునాపరెడ్డి గారు (2024 అల్ఫరెట్ట), ప్రవీణ్ కాశిభట్ల గారు (2024 అల్ఫరెట్ట), సువర్ణ రేఖ గారు (2023 కమ్మింగ్), వెంకట కృష్ణ మజ్జిగ గారు (2024 కమ్మింగ్), సుధారాణి భీమవరపు గారు (2024 కమ్మింగ్).

మనబడి ప్రభాసం గురువులు: గౌరి బానవతుల గారు (2023 డన్వుడి, అల్ఫరెట్ట, 2024 కమ్మింగ్), నీరజ విష్ణుభట్ల గారు (2023 అల్ఫరెట్ట),సుబ్రహ్మణ్యం విష్ణుభట్ల గారు (2024 అల్ఫరెట్ట), అన్ను రామిశెట్టి గారు (2024 అల్ఫరెట్ట), మృదుల ములుకుట్ల గారు (2024 అల్ఫరెట్ట), శ్రీభవ ఉప్పలురి గారు (2024 రివర్డేల్), చంద్రశేఖర్ బీరకాయల గారు (2023, 2024 కమ్మింగ్), సుచేత కంచనేపల్లి గారు (2023 కమ్మింగ్).

తమ తమ తరగతుల విద్యార్థులను (Students) వేదిక మీదకు ఆహ్వానించారు. ఇతర తరగతుల గురువులు కూడా వేడుకలో పాల్గోని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. 2022-2023, 2023-2024 ప్రకాశం మరియు ప్రభాసం విద్యార్థులు ఒక్కక్కరు వేదిక మీదకు వచ్చి శ్రీ కిషన్ రావు గారి చేతి మీదుగ తమ పట్టాలను అందుకున్నారు. ఇంటింటా మనబడి పిల్లలు కూడా పట్టాలను అందుకున్నారు. ఆద్యంతం మనబడి గీతం అందరిలో ఉత్సాహాన్ని నింపింది.

అట్లాంట తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta – TAMA) నుంచి బోర్డు చైర్మన్ శ్రీనివాస్ ఉప్పు, అధ్యక్షులు సురేష్ బండారు మరియు కార్యవర్గం సభ్యులు సభలో పాల్గొని సిలికానాంధ్ర మనబడికి వారి మద్దత్తుని, సహకారముని ప్రకటించారు. అనూరాధ రామిశెట్టి గారు చేసిన వేదిక అలంకరణ, ఫోటో బూత్ తో వేదికకు వన్నె తెచ్చింది.

(Graduation Ceremony) కార్యక్రమం విజయవంతంగా జరుపుకోవడనికి సహకరించిన అందరిని యశ్వంత్ జొన్నలగడ్డ గారు పేరు పేరున వేడుక చివర్లో అభినందించి ధన్యవాదలు తెలియ చేసారు.వీరిలో ముఖ్యులు – వేదికను మరియు ఫోటో బూత్ లను అందంగా తీర్చి దిద్దిన అనూరాధ రామిశెట్టి గారు, స్వప్న గారు, దుర్గ గారు, సహస్ర గుండ్ర, నిత్య వలివేటి, విందు ఏర్పాట్లు చూసిన నవీన్ గారు, శ్రీరాం గారు, రాహుల్ గారు, సాయిరాం కారుమంచి గారు, వెంకీ గద్దె గారు, ఫోటోగ్రాఫర్ చంద్రశేఖర్ బీరకాయల గారు, చైతన్య గారు, DJ స్వామి గారు.

మాలిని గారి Go Green బృందం నుంచి కల్యాణి యాతం గారు, ఉషా తంగవల్ గారు మరియు వారి యువ బృందం అందరికి మంచి నీళ్ళ సదుపాయం చేసారు. Indian Flavors వెంకట్ గారు ఏర్పాటు చేసిన టీ, సమోస, క్యారెట్ హల్వ అందరు సేవించి ఆనందముగా Atlanta Graduation Ceremony కార్యక్రమముని పూర్తి చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected