Connect with us

Language

Buffalo Grove, Illinois: తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెబుతూ సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగ

Published

on

Buffalo Grove, Illinois: తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెపుతూ తెలుగుని నలు దిశలా వ్యాపింప చేస్తున్న “సిలికానాంధ్ర మనబడి” (Silicon Andhra Mana Badi) పిల్లల పండుగ కార్యక్రమము మార్చ్ నెల తొమ్మిదవ తేదీన బెన్సెల్విల్లే (Bensenville) లోని మానవ సేవ మందిరం ప్రాంగణంలో కన్నుల పండుగగ జరిగింది.

బఫల్లో గ్రోవ్ (Buffalo Grove) మరియు కమ్బర్లాండ్ (Cumberland) కేంద్రాలలో తెలుగు అభ్యసిస్తున్న చిట్టి చిన్నారుల బుజ్జాయి మాటలతో, పట్టు పరికిణీలు, పంచల వెలుగు జిలుగులతో ప్రాంగణం అంత సందడి వాతావరణం నెలకొన్నది. వచ్చే తెలుగు పండగైన ఉగాది మరియు షడ్రుచులతో మొదలు పెట్టి, ప్రతి నాటికలో మరియు ఇతర రూపకములలో తెలుగు భాష తియ్యందనానిని పంచుతూ ఆద్యంతం ఉల్లాసముగా పిల్లలు ప్రదర్శనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో కేంద్ర సమన్వయ కర్త Dr. వెంకట్ గంగవరపు (Dr. Venkat Gangavarapu) గారు, బఫెలో గ్రోవ్ సమన్వయ కర్తలు పావని గంగవరపు (Pavani Gangavarapu) గారు, నరేంద్ర గుడపాటి (Narendra Gudapati) గారు మరియు కమ్బర్లాండ్ సమన్వయకర్త సురేఖ గళ్ళ (Surekha Galla) గారు దీక్షాదక్షులయినారు. వెంకట్ గంగవరపు గారు మాట్లాడుతూ భాష సేవయే భావి తరాల సేవ అనే నినాదం తో సిలికాన్ ఆంధ్ర మనబడి సంస్థ పని చేస్తోందని, ప్రతి సంవత్సరము అంచెలంచలుగు ఎదుగుతూ ఈ రోజు మనబడి సంస్థ స్థాపించబడి 18 వసంతాలు పూర్తి చేసుకున్నది అని తెలిపారు.

బఫెల్లో గ్రోవ్ (Buffalo Grove) మనబడి కేంద్రం లో ఈ సంవత్సరం 180 విద్యార్థులు నమోదు చేసుకున్నట్టుగా మరియు ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్రంలో ఈ సంఖ్య 500 దాటినట్లుగా కూడా తెలిపారు. పిల్లలకి తెలుగుని మరింత చేరువ చెయ్యాలి అనే ప్రయత్నం లో భాగముగా మాటలాట మరియు బాలానందం వంటి వివిధ కార్యక్రమములని కూడా నిర్వహిస్తున్నట్టుగ, వాటికీ ప్రతి సంవత్సరం ఆదరణ పెరుగుతున్నట్టుగా తెలియచేసారు.

మనబడి (Manabadi) లో స్వచ్చందముగ భాషా సేవకై కృషి చేస్తున్న ఉపాధ్యాయులని మరియు ఇతర సహాయక బృందాన్ని కొనియాడారు. ఏదయినా కేవలం బఫెలో గ్రోవ్ (Buffalo Grove) కేంద్రం లో సంవత్సరానికి 5000 గంటల పైబడి పని సమయాన్ని వెచ్చించి పిల్లలకి తెలుగు నేర్పడం. ఈ తరం అవసరానికి తగ్గట్టుగా పాఠ్యపుస్తకాలని తీర్చి దిద్దడం వెనక మనబడి, నిర్వాహకులు మరియు ఉపాధ్యాయులు కృషిని కొనియాడ వలసినదే.

అందరికి స్వాగతము పలుకుతూ తొలిపలుకులని రజినికాంత్ వున్నం అందించగా, తొలి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన పూర్ణిమ వేముల (Poornima Vemula), వెంకట్ పెరుగు గార్లు తమ సంభాషణ చతురతతో ప్రేక్షకులకి ప్రతి నాటికని పరిచయం చేస్తూ కార్యక్రముముని ముందుకు తీసుకు వెళ్లారు.

ఆ పైన వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంధ్య జంధ్యాల (Sandhya Jandhyala) మరియు సత్య ప్రవీణ్ మంగళంపల్లి (Satya Praveen Mangalampally) గార్లు తెలుగు భాషలో మరుగున పడుతున్న కొన్ని సామెతలు మరియు కొన్ని ఇతర విషయాల పైన ప్రస్నోత్తరములతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. పిల్లలు కూరగాయలు, పండ్లు, శరీరభాగాలు ఇతరత్రా సమాచారాత్మక విషయాలని తెలుపుతూ వేసిన నాటికలు వేసినారు.

నీతిని తెలుపుతూ వేసిన “తగిన శాస్తి”, “మర్యాద రామన్న” వంటి నాటికలు; ఆద్యంతమూ హాస్యభరితముగా సాగిన “వంకాయ పులుసు”, “యమగోల”, “స్టూడెంట్స్ రాక్ – గురువుగారు షాక్ “, “టీవీ పకోడీ” అలాగనే “మనబడి విద్యార్థులు జ్ఞాపకాలను నెమరువేసుకోవడం” నిర్వాహకుల కష్టాలను తెలియజేస్తూ చేసిన హాస్య ప్రహేళికలు కార్యక్రమమునకి విచ్చేసిన తల్లితండ్రులని మరింతగా ఉత్సాహ పరిచాయి.

ఈ విషయం లో వేదిక దగ్గర పిల్లలకి ఉపాధ్యాయులకు సహాయ పడ్డ జగన్ మెట్పల్లి (Jagan Metpally) మరియు పవన్ పల్లి (Pawan Palli) గారికి ధన్యవాదములు. మనబడి బఫెలో గ్రోవ్ (Buffalo Grove) లో తెలుగు నేర్చుకొని హైస్కూల్ లో Biliteracy సర్టిఫికెట్ పొందిన పూర్వ విద్యార్థులని వేదిక పైకి ఆహ్వానించి తెలుగు నేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనముని మరింతగా విడమరిచి చెప్పారు.

Adlai E Stevenson High School, Lincolnshire మరియు Libertyville High స్కూల్స్ తో పాటు మరిన్ని ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్ర హైస్కూల్స్ లో తెలుగు భాషని Biliteracy పరీక్షకు అనుమతించారన్న విషయాన్నీ అందరికి తెలియ చేసారు. ఈ సందర్భముగా విద్యార్థులు మాట్లాడుతూ మనబడి వారు ఏర్పాటు చేస్తున్న మాటలాట మరియు బాలానందం కార్యక్రమములు తమకు ఎంతగానో దోహద పడినట్లుగా పేర్కొన్నారు.

బాలానందముతో పిల్లలలోని సృజనాత్మకతను బయటకి తెస్తున్న అన్నపూర్ణ కాలనాథభట్ట గారి కృషి మరియు మాటలాటని సమన్వయపరుస్తూ పిల్లలని ఉత్సాహపరుస్తున్న దీప్తి ముసునూరి (Deepthi Musunuri) గారి కృషి శ్లాఘనీయము. బహు సుందరముగ అలంకరించిన వేదిక పక్కనే గణనాథుని ప్రతిమ పెట్టినారు.

ఉన్నత వేదికపైన తెలుగు తల్లి చిత్రము, తెలుగు తల్లికి వందనములు చెపుతున్నట్టుగా చిట్టి చిన్నారుల చిత్రాలు , పక్కనే ఛాయా చిత్రాల కొరకు అలంకరించిన పువ్వుల గోడ తివాచి అందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఒక పండుగ వాతావరణాన్ని నెలకొలిపాయి. ఈ అలంకరణకు అనిల్ పొన్నూరు, రీతూ భోగాది మరియు సభ్యులు స్వాతి అక్కినేని, మణి గుడపాటి, రమణి గోగుల, దీప్తి ముసునూరు మరియు పావని గంగవరపు గార్లకి జోహార్లు చెప్పవలసినదే.

ఏ కార్యక్రమమైనా ఆహారానికి ఉండే ప్రాధాన్యత వేరు అది కూడా మన తెలుగు వంటలతో అల్పాహారం మామిడికాయ పప్పుతో భోజనము ప్రత్యేకముగా చెప్పవలసినదే, రివాజ్ రెస్తౌరంటు (Rivaj Indian Cuisine) వారిని మెచ్చుకోవాలి. ఆహార విభాగములో సభ్యులు ప్రతి అంశాన్ని పరికించి చూస్తూ ఎంతో శ్రద్ధతో ప్రాంగణముని శుభ్రముగా ఉంచడముతో పాటు అందరికి ఆహారం అందేలా చూడడం చెప్పుకోదగ్గ విషయము.

విభాగ సభ్యులు సుమంత్ పూనుకొల్లు, రమేష్ గోరంట్ల, రమణ మల్లాది, కృష్ణ మొవ్వ , క్రాంతి కంభంపాటి, సాయి సుందరి, ఆనిల్ పొన్నూరు, గౌతమ్ భావాండ్ల, శ్రీకర్ తుమ్మల, రాకేష్ కుప్పలు, కిరణ్ గుట్ట, సాయి మర్రి, జగన్ వేముల, రజనీకాంత్ తిమ్మంచెర్ల, రంజిత్ బట్టి, చిరంజీవి గళ్ళ, సుబ్బారావు మాదాల మరియు శ్రీకాంత్ నెమని గార్లు ఆహార రుచితో పాటు వడ్డన విషయం కూడా చక్కటి జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమమును కూర్చి విద్యార్థులను తీర్చి దిద్దిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు బృంద బట్టారం, వనిత వున్నం, స్వాతి ఇవటూరి, సంధ్య జంధ్యాల, వెంకట్ పెరుగు, నీలిమ పప్పు, నీలిమ కల్లూరి, రజని కాంత్ వున్నం, కళ్యాణ్ జువ్వాది, నిశిత కట్ట, పూర్ణిమ వేముల, రమణి గోగుల, రాజి గొరిట్యాల, లక్ష్మి గంగిశెట్టి, దీప్తి ముసునూరు, శ్వేతా శ్రీరామ్, కళ్యాణి గొల్లవిల్లి, స్వాతి అక్కినేని, సాగర్ శిఖరం, ధనరూప పోతిన, మణి వేమూరి, రాజేశ్వర్ గుబ్బ, సంజయ్ గోగుల, సత్య ప్రవీణ్ మంగళంపల్లి, అన్నపూర్ణ కాలనాథభట్ట, పుష్పలత దాసరి, మాధవి లంక, వాణి కొల్లి మరియు సురేఖ గళ్ళ గార్లకు పావని గంగవరపు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నరేంద్ర గూడపాటి (Narendra Gudapati) మరియు రమణి గోగుల (Ramani Gogula) మాట్లాడుతూ ఈ కార్యక్రమము ఇంత అట్టహాసముగా జరగడానికి దోహద పడిన ప్రాయోజిత సంస్థలు మరియు వ్యక్తులకు రీతూ భోగాది, కృష్ణ రంగరాజు, సుసాన్ లిబిమన్, దయాకర్ జాలే, ప్రవీణ్ దోనేపూడి, భార్గవి కన్నెగంటి, Z3 టెక్నాలజీస్ మరియు మనబడి పిల్లల తల్లితండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేకించి మనబడి (Mana Badi) లో చదువుతూ తాను కష్టబడి సంపాదించినా 500 డాలర్లును విరాళముగ ఇచ్చిన మేఘన కూచిమంచిని అందరు అభినందించి తీరాల్సిందే.
మహేష్ చదలవాడ గారు ఏర్పాటు చేసిన Sound System పిల్లల మాటలు ప్రేక్షకులకు చేరుకోవడానికి సహాయ పడగా. రోషన్ మాదిరెడ్డి గారి బృందం ఛాయా చిత్రాలను, వీడియోలను తీస్తూ కార్యక్రమముని మరపురాని జ్ఞాపకముగా మలిచారు అని ప్రస్తుతించారు.

error: NRI2NRI.COM copyright content is protected