తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ చైతన్య స్రవంతి క్రార్యక్రమాలు భారతదేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న విషయం రోజూ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా తానా మీడియా కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) తన జన్మభూమి కృష్ణా జిల్లా, పెనమలూరులో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించడానికి పక్కా ప్రణాళిక రచించారు.
ఇప్పటికే పలు దఫాలుగా పెనమలూరు ఎన్నారై (Penamaluru NRI) అసోసియేషన్ ద్వారా మరియు తానా ద్వారా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించిన ఠాగూర్ మల్లినేని ఇప్పుడు తానా చైతన్య స్రవంతి క్రార్యక్రమాలలో భాగంగా క్యాన్సర్ క్యాంపు, చేయూత, ఆరుణ్య కార్యక్రమాల ద్వారా వచ్చే వారాంతం డిసెంబర్ 24 శనివారం రోజున మరోసారి తన ఉదారతను చాటనున్నారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ సహకారంతో తానా ఫౌండేషన్ సెక్రెటరీ శశికాంత్ వల్లేపల్లి తో సమన్వయం చేసుకుంటూ ఈ శనివారం ఉదయం 9 గంటలకు పెనమలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 25 మంది మెరిట్ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు (Scholarships) అందించనున్నారు.
అదే రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్య గారపాటి సమన్వయంతో నిర్వహించే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు (Cancer Screening Camp) లో బీపీ, షుగర్, మామోగ్రఫీ, బిఎంఐ, పాప్స్మియర్, ఛాతి ఎక్సరే, ఓరల్ పరీక్షలు, క్లినికల్ ఎగ్జామినేషన్ వంటి క్యాన్సర్ ఎర్లీ డిటర్మినేషన్ టెస్టులు చేయనున్నారు.
అలాగే ఆరుణ్య (ENT) ప్రాజెక్టులో భాగంగా చిన్నలకు పెద్దలకు వినికిడి, చెవి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయనున్నారు. 5 సంవత్సరాల వయస్సు లోపు పుట్టు చెవిటి, మూగ పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తారు. ఈ ప్రాజెక్టుకి తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి సమన్వయకర్త గా వ్యవహరించనున్నారు.
పెనమలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తానా మీడియా కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ సేవాకార్యక్రమాలలో పెనమలూరు చుట్టుప్రక్కల వారంతా పాల్గొని, ఈ ఉచిత సేవలను వినియోగించుకోవలసిందిగా తానా వారు కోరుతున్నారు. ఎప్పటిలానే పెనమలూరు కి చేదోడు వాదోడుగా ఉంటున్న ఠాగూర్ ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. తానా చైతన్య స్రవంతి క్రార్యక్రమాలకు సునీల్ పంత్ర సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నారు.