Connect with us

Celebrations

ఘనంగా సతీష్ వేమన 50వ పుట్టినరోజు వేడుకలు

Published

on

సతీష్ వేమన 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వర్జీనియా మానస్సస్ ప్రాంతంలోని ఫాక్స్ చేజ్ ఈవెంట్ హాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య మైల్స్టోన్ పుట్టినరోజును జరుపుకున్నారు. నిన్న శనివారం ఫిబ్రవరి 12న ముఖాముఖీగా ఈ వేడుకలు జరిగాయి.

అమెరికాలో ఇటు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రెసిడెంట్ గా చేయడంతోపాటు అటు ఎన్నారై తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోనూ వేమన చురుకుగా పాల్గొనేవారు. దీంతో వేమన స్నేహితులు, సహచరులు, తానా పాత కొత్త కార్యవర్గ సభ్యులు, అభిమానులు, బంధుమిత్రులు విరివిగా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

స్థానిక స్నేహితులతోపాటు టెక్సాస్, మిచిగాన్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ డి సి తదితర రాష్ట్రాలనుంచి వేమన స్నేహితులు భారీగానే హాజరయ్యి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. వేమనను అందరూ ప్రేమగా ఎలా పిలుస్తారు అంటూ సత్తి, మామ, అన్న ఇలా వివిధ పేర్లతో ఉన్న బ్యానర్ అందరినీ ఆకట్టుకుంది.

error: NRI2NRI.COM copyright content is protected