Connect with us

Community Service

Hanamakonda, Warangal: యువ తరంగంలో కొత్త కెరటం న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కొరం

Published

on

సంతోష్ కొరం (Santosh Reddy Koram) యువ తరంగంలో కొత్త కెరటమై లేచాడు. స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌కు స‌వాల్ విసురుతున్నాడు. తెలుగు వారికి సేవ చేయాలన్న తపన.. తపస్సు.. దానిని నిజం చేయడానికి నిరంతరమైన ఆలోచనలు.. అలుపెరగని శ్రమ. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే యత్నం చేస్తున్నాడు సంతోష్ కొరం.

సంతోష్ కొరం నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌కు మ‌రో గౌర‌వం ద‌క్కింది. అమెరికన్ తెలుగు అసోషియేష‌న్ (American Telugu Association – ATA) బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీ ఎన్నిక‌ల్లో లైఫ్ పాట్రన్‌గా ఎన్నికయ్యారు. ఆయ‌న నూత‌న ప‌య‌నం మ‌రెంతో మందికి మ‌ద్ద‌తుగా నిలుస్తుందంటూ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

హన్మకొండ (Hanamakonda) లోని నయీంనగర్‌లో పుట్టి, జనగామ సమీపంలోని సింగరాజుపల్లిలో పెరిగారు సంతోష్ కొరం (Santosh Reddy Koram). లింగాల వెంకట్ రెడ్డి మనవడు, సింగరాజుపల్లి వరంగల్ (Warangal) ఉమ్మ‌డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన సుకృతాదేవి, ఇంద్రసేన రెడ్డి దంపతుల కుమారుడు. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, మహారాజా స్కూళ్ల‌లో చ‌దివి, మాస్టర్స్ పూర్తి చేశారు. హైదరాబాద్‌ (Hyderabad) లో విద్యార్థి, యువజన సంఘాలకు మార్గనిర్దేశం చేస్తూ, సంతోష్ తన స‌మాజ‌ సేవా ప్రయాణాన్ని ప్రారంభించారు.

ముషీరాబాద్‌లో భారతీయ యువ మోర్చా (Bharatiya Janata Yuva Morcha) అధ్యక్షుడిగా 2 సార్లు పని చేశారు. నాయకుడిగా అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు. అనేక మంది విద్యార్థులకు సహాయంగా చేర్పులు చేయించడం, మల్టీ మిలియన్ డాలర్ల దాతృత్వ (Multimillion Dollar Philanthropic) కార్యక్రమాలను అమలు చేయడం వంటి కార్యాచరణలు ఆయన చేపట్టారు. ఆయన సేవలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, పేరొందిన దాతృత్వ సంస్థల నుంచి ప్రత్యేకమైన గుర్తింపును పొందాయి.

అమెరికాలో ప్రభావశీల సేవా ప్రస్థానం

గత 17 ఏళ్లుగా, సంతోష్ కొరం (Santosh Reddy Koram) అమెరికాలోని వ‌ల‌స‌ భారతీయుల‌కు మద్దతుగా నిలిచారు. ఒక విద్యార్థిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, అమెరికాలో బిజినెస్ రంగంలోకి దిగారు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించి ప్రముఖ వ్యాపారవేత్తగా (Business Man) ఎదిగారు. తన వృత్తి విజయాలతో పాటు, భర్తగా, తండ్రిగా కుటుంబానికి అంకితంగా నిలిచారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో న్యూజెర్సీ (New Jersey) లోని సమాజానికి అత్యవసర సేవలను అందించి, న్యూజెర్సీ సెనేట్ ప్రోక్లమేషన్ (New Jersey Senate Proclamation) వంటి ప్రతిష్టాత్మక గుర్తింపును పొందారు. అంతేకాకుండా 20 మంది భారతీయ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి, వారి చదువు, జీవన అవసరాలను తీర్చారు. మరొక వైపు, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రెండు వృద్ధాశ్రమాలను దత్తత తీసుకుని, 90 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) లో కీలక పాత్ర

ఆటా (American Telugu Association – ATA) న్యూజెర్సీ రీజియన్ కోఆర్డినేటర్‌గా సంతోష్ సమాజానికి కలయికగా నిలుస్తూ ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. 2020 నుండి, వైవిధ్యభరితమైన వ్యాపార సమావేశాలు, పెద్దస్థాయి ఈవెంట్లను ఏర్పాటు చేసి ATA సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఆయన నెట్‌వర్క్ ద్వారా భారతీయ వలసల వారికి పాస్‌పోర్ట్‌లు, అమెరికాలో జన్మించిన పిల్లలకు వీసాలు, OCI కార్డులు పొందడంలో సహాయం చేశారు.

భవిష్యత్తు వైపు అమెరికా, భారతీయ సమాజాల మధ్య అనుబంధాన్ని బలపర్చడంలో సంతోష్ కోరం (Santosh Reddy Koram) కీలక పాత్ర పోషిస్తున్నారు. ATA బోర్డు ఆఫ్ ట్రస్టీలలో గెలుపొంద‌డంతో సమాజంపై మరింత ప్రభావం చూపి, సంబంధాలను బలపరిచే దిశగా ముందడుగు పడతుందని విశ్వసిస్తున్నారు. “సమాజానికి మరింత దగ్గరగా ఉండి, సేవల ద్వారా తిరిగి ఇవ్వడమే నా జీవిత లక్ష్యం” అని సంతోష్ కోరం చెబుతున్నారు.

సంతోష్ కొరం (Santosh Reddy Koram) 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంపై ముద్ర వేసిన ఒక విశిష్ట వ్యక్తి. సమాజానికి అంకితమైన నాయకుడు, దాతృత్వానికి (Charity) ప్రతీకగా నిలిచిన సేవ‌కుడు. తన కార్యాచరణ ద్వారా అనేక‌మందిలో కొత్త వెలుగులు నింపుతూ ఎంద‌రికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected