ఇప్పుడు అట్లాంటాలో టాక్ ఆఫ్ ది టౌన్ ‘సంక్రాంతి‘. ఇప్పుడు సంక్రాంతి పండగ ఏంటి అనుకుంటున్నారా? ఐతే మీరు పప్పులో కాలేసినట్లే. అదేనండి అట్లాంటాలో ఈమధ్యనే జార్జియా స్టేట్ రిప్రజంటేటివ్ టాడ్ జోన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రయన్ కెంప్ మరియు జాన్స్ క్రీక్ మేయర్ మైక్ బొడ్కర్ చేతులమీదుగా రిబ్బన్ కటింగ్ చేసుకొని దూసుకెళ్తున్న సంక్రాంతి రెస్టారెంట్ గురించి చెప్తున్నా.
ఇండియన్, ఇండో – చైనీస్ మరియు ఇంటర్ కాంటినెంటల్ క్యుసిన్స్ తో ప్రతిరోజూ 60 ఐటమ్స్, వారాంతం ఐతే 80 ఐటమ్స్ తో నార్త్ అమెరికాలోనే అతిపెద్ద బఫెట్ సర్వ్ చేస్తున్న ఏకైక రెస్టారెంట్. 300 సీటింగ్ రెస్టారెంట్ తోపాటు ఫైన్ డైనింగ్ కి అనువుగా 400 మందికి సరిపడే బాంక్వెట్ హాల్ మరియు చిన్న చితకా పార్టీలకు సరిపడే 175 సీటింగ్ & 100 సీటింగ్ బాంక్వెట్ హాళ్లు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్లగ్ అండ్ ప్లే ఆడియో ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, వంద శాతం స్టెయిన్లెస్ స్టీల్ అప్ప్లయన్సెతో నిండిన నాలుగు వేల చదరపు అడుగుల కిచెన్ అన్నిటికంటే హైలైట్. ఇంత పెద్ద కిచెన్ తోపాటు నలభీముల్లాంటి కుక్స్ ఉండటంవల్లనేమో ఏమో గాని ఏ వంటకం కావాలంటే ఆ వంటకం లేదనకుండా నోరూరేలా తెచ్చి ముందుపెడుతున్నారు.
పేరుకు తగ్గట్టుగానే షాండ్లియర్స్, ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కుర్చీలు, అందంగా చెక్కిన తలుపులు మరియు హై సీలింగ్స్ తో పండుగలా ముస్తాబు చేసిన ఈ సంక్రాంతిలో బోనస్ గా వాలెట్ పార్కింగ్ కూడా. ఫుడ్ తోపాటు ఇన్ని ప్రత్యేకతలు ఉండడంవల్లనేమో తింటే సంక్రాంతి రెస్టారెంట్లోనే తినాలి అంటున్నారు అట్లాంటా వాసులు. మరి ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతికి ఒక టూర్ వేద్దాం పదండి.