Connect with us

Festivals

ది పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు: Cumming, Georgia

Published

on

జార్జియా లోని కమ్మింగ్ (Cumming) నగరంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ లో తెలుగువారు అందరూ కలిసి సంప్రదాయ పద్దతిలో పిల్లలు, పెద్దలు సందడిగా సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

జనవరి 20 శనివారం రోజున సంక్రాంతి (Sankranthi) ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇండియాలో వలే మహిళలు సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ తెలుగువారి కల్చర్ ని గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు, పురుషులు అందరూ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

చిన్నారులను భోగి పళ్లతో పెద్దలు దీవించారు. యువత సైతం తమ తమ తల్లితండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం ఆటలు, పాటలు, నృత్యాలతో ఉల్లాసంగా గడిపారు.

రంగు రంగుల గాలి పటాలు (Kites) తయారుచేసుకొని, వాటిని ఎగురవేస్తూ పిల్లలు ఉత్సాహంగా కనిపించారు. ఫోటో బూత్ వద్ద అందరూ ఫోటోలు తీసుకున్నారు. తమిళవారు, ఉత్తర భారతదేశ వాసులు కూడా ది పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ (The Parc at Creekstone) సంక్రాంతి సంబరాలలో ప్రతి సంవత్సరం పాల్గొనడం విశేషం.

పలు భాషల్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం భిన్నత్వంలో ఏకత్వంలా భారతదేశ సౌభ్రాతృత్వాన్ని తెలియజేసినట్టయింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతో గత 13 సంవత్సరాలుగా పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected