Connect with us

Social Service

Shantha Biotechnics వరప్రసాద్ రెడ్డితో Sankara Nethralaya USA ఆత్మీయ సమావేశం, భారీ విరాళాల ప్రకటన

Published

on

Dallas, Atlanta, May, 2025: శంకరనేత్రాలయ యుఎస్సే 1988 జూన్‌లో రాక్‌విల్, మేరీల్యాండ్, USA లో స్థాపించబడి, ఒక అత్యుత్తమ 501(C) (3) లాభాపేక్ష లేని సంస్థ గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీని ఏకైక లక్ష్యం అమెరికాలో సాంస్కృతిక  కార్యక్రమాల ద్వారా నిధులను సేకరించి భారతదేశంలోని శంకర నేత్రాలయ (చెన్నై) సంస్థ సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం.

శంకర నేత్రాలయ సంస్థ సలభై ఏడేండ్ల క్రితం అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి పిలుపుతో, డా. ఎసెస్ బద్రీనాథ్ ఆధ్వర్యంలో స్థాపించబడి, భారత ఉపఖండంలోనిరుపేద రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలైన ఉచిత కంటి చూపును అందించడానికి అంకితభావంతో పనిచేస్తున్న సమగ్రనేత్ర సంరక్షణ కేంద్రం. మార్చి30న అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, మరియు శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి గారితో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశం శంకర నేత్రాలయ యుఎస్సే అధ్యక్షడు శ్రీబాలారెడ్డి ఇందుర్తి గారి ఆధ్వర్యంలో, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీ శ్రీని వంగిమళ్ళ, శ్రీ ఉపేంద్ర రాచుపల్లి, శ్రీమతి నీలిమ గడ్డమణుగు,డా. కిషోర్‌ రసమల్లు, మరియు రాజేష్ తడికమల్లల మధ్య, సుమధురసంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనాల సాక్షిగా ఒక అపూర్వ సంగమం అనిచెప్పుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ యుఎస్సే సంస్థ ఎదుగుదల, మరియు వేగవంతంగా నిర్వహిస్తున్నమేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా  రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇది అతని గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలు శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారని, ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సమానమైనసహాయం అని అద్యక్షుడు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు.

అంతేగాకా  2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి గారు తమ అంకితభావాన్నిప్రకటించడం ఆనందదాయకం. తన USA ప్రయాణంలోని ఒక భాగంగా, డాక్టర్వరప్రసాద్ రెడ్డి గారు డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుశ్రీ ప్రకాశ్ బేడపూడి గారు — CTO మరియు EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ఆహ్వానం మేరకు శ్రీ ప్రకాశ్ గారు తమ స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

శ్రీ వరప్రసాద్రెడ్డి గారి జీవిత సత్యాలు, సందేశాలు, వారు ప్రసాదించిన సంగీత‘వీనుల విందుల” మధ్య, ఆత్మీయుల ముచ్చట్లతో నిండిన  ఆ సాయంత్రం చిరస్మరణీయం. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యి, సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు.

శ్రీ ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థ కార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. శ్రీ బాలరెడ్ది ఇందుర్తి గారు డాక్టర్ వరప్రసాద్రెడ్డి గారికి, శ్రీ ప్రకాశ్ బేడపూడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు ఆత్మీయసమావేశాలు మంచి అనుభూతిని మిగిల్చాయని సంస్థ సభ్యులతో పంచుకొన్నారు.

 

error: NRI2NRI.COM copyright content is protected