Connect with us

News

ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ నుండి ATA ఎన్నికల్లో సంగమేశ్వర రెడ్డి రెడ్డిగారి

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) లో 2025-28 కాలానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అయినటువంటి టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ (Austin, Texas) నగరం నుండి సంగమేశ్వర రెడ్డి రెడ్డిగారి పోటీ చేస్తున్నారు.

గత 12 సంవత్సరాలుగా ఆటా తో నడుస్తున్న సంగమేశ్వర రెడ్డి (Sangameshwar Reddy Reddygari) ఆటా రీజినల్ కోఆర్డినేటర్ గా మరియు ఆటా రీజినల్ డైరెక్టర్ గా గ్రేటర్ ఆస్టిన్ లోని తెలుగువారికి ఆటా ని మరింత దగ్గిర చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో లైఫ్ కేటగిరీ (Life Members Category) లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ పదవికి పోటీ చేస్తున్నారు.

అలాగే ఆస్టిన్ స్థానిక తెలుగు సంఘం అయినటువంటి తెలుగు కల్చరల్ అసోసియేషన్ (Telugu Cultural Association – TCA) లో జాయింట్ సెక్రెటరీ, సెక్రెటరీ, ప్రెసిడెంట్, బోర్డ్ మెంబర్ మరియు 25 సంవత్సరాల వేడుకలకు కల్చరల్ ఛైర్ గా ఎన్నో సేవలందించారు. దీంతో ఆస్టిన్ (Austin) తెలుగువారిని ఆటా కార్యక్రమాలతో మమేకం చేశారు.

ఆటా (America Telugu Association – ATA) లో ఆ పదవీకాల సమయంలో ఫుడ్ డ్రైవ్స్, హెల్త్ క్యాంప్స్, స్పోర్ట్స్ మీట్స్, మహిళాసాధికారత (Women Empowerment) కార్యక్రమాలు, ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్స్, 5కే రన్, సెమినార్స్ వంటి ఆటా కార్యక్రమాలను ముందుండి నడిపించడమే కాకుండా అందరికీ మార్గదర్శిగా నిలిచారు.

గత ఆటా కన్వెన్షన్ (18th ATA Convention & Youth Conference) కి సంబంధించి సయ్యంది పాదం, ఝుమ్మంది నాదం, బ్యూటీ పాజెంట్ కార్యక్రమాలను ఆస్టిన్ (Austin) లో గ్రాండ్ గా నిర్వహించడమే కాకుండా ఆస్టిన్ లోకల్ టీమ్స్ ని అట్లాంటా కన్వెన్షన్ లో నిర్వహించిన ఫైనల్స్ కి పంపారు. అలాగే అట్లాంటా (Atlanta) కన్వెన్షన్ కి పెద్ద ఎత్తున విరాళాలు పోగేశారు.

ఈ ఎన్నికలలో తనని గెలిపిస్తే ఆటా ని మరింత బలోపేతం చేస్తానని, చిన్న చిన్న నగరాలలో కూడా ఆటా ని మరియు ఆటా సేవాకార్యక్రమాలను (ATA Service Activities) విస్తరిస్తానని, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి మన సంస్కృతీసాంప్రదాయాలను చేరువ చేస్తానని సంగమేశ్వర రెడ్డి (Sangameshwar Reddy Reddygari) అన్నారు.

సంగమేశ్వర రెడ్డి ప్రధాన లక్ష్యం తెలుగు వారు పండుగలు మరియు వివిధ కార్యక్రమాలు ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకమైన ప్రదేశం (Event Space) అందించడం. ఈ సందర్భంలో అన్ని వేడుకలను ఒకే ప్రదేశంలో జరుపుకునేలా స్థలం లేదు. అందుకే సంగమేశ్వర రెడ్డి ఈ విషయంపై గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

కావున అమెరికన్ తెలుగు అసోసియేషన్ లైఫ్ కేటగిరీ సభ్యులందరూ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (ATA Board of Trustee) గా సంగమేశ్వర రెడ్డి రెడ్డిగారి కి మరియు స్లేట్ లోని ఇతరులకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు. డిసెంబర్ 2న పోస్ట్ ద్వారా పంపిన బాలట్స్ ని వోట్ వేసి తిరిగి డిసెంబర్ 20వ తేదీ లోపు ఆటా కి అందేలా పంపాలని మనవి చేస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected