Connect with us

Devotional

వైభవంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట: Saginaw, Michigan

Published

on

ఉత్తర అమెరికా లోని మిచిగన్ స్టేట్, సాగినా నగరంలో ఈ నెల 13 వ తేదీన సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట చాలా వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ట కార్యక్రమం లో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధన ల తో పాటు, సాయిబాబ, దత్తాత్రేయ మరియు నవగ్రహ హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ “బ్రహ్మశ్రీ” భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) గారి ఆధ్వర్యం లో ముగ్గురు పూజారులు నిర్వహించారు.

విగ్రహ ప్రతిష్ట లో భాగంగా శ్రీ యుగంధర శర్మ గారు అలంకరించిన సర్వతో భద్రమండలి సకల దేవతారాధన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలాగే, శర్మ గారు హొమారాధనలో పాల్గొన్న భక్తులకు సంస్కృతం లోని వేద మత్రాలను తెలుగు లో అనువదించడం చాలా అభినందనీయం. మూడు రొజుల పాటు సాయి నామ కీర్తనలు, మంత్రోచ్చారణలతో సాయిసమాజ్ ఆఫ్ సాగినా ప్రతిధ్వనించిందని కార్యక్రమం లో పాల్గొన్న పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు.

జనవరి లో కేవలం నలుగురు స్నేహితులు కలిసి ప్రారంభించిన సాయి బాబా ధ్యానమందిరం ఎనిమిది నెలల్లో దేవాలయం గా రూపు దిద్దుకున్నందుకు చాలా ఆనందం గా ఉందని సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మురళీ గింజుపల్లి అభిప్రాయ పడ్డారు. ఈ ఆలయ నిర్వహణ లో ప్రతి రోజు సహకరించిన శ్రీనివాస్ వేమూరి, హరిచరణ్ మట్టుపల్లి, శ్రీధర్ గింజుపల్లి, సాంబశివరావ్ కొర్రపాటి, లీలా పాలడుగు, లక్ష్మి మట్టుపల్లి మరియు కృష్ణ జన్మంచి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీ సాయిబాబా విగ్రహాన్ని తన స్వంత ఖర్చుల తో రాజస్థాన్ నుండి తెప్పించిన శ్రీ వేమూరి నీలిమ-శ్రీనివాస్ దంపతులకు భక్తులందరు అభినందనలు తెలియచేశారు. ఇంకా డాక్టర్ గింజుపల్లి మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి గురువారం ప్రవాస భారతీయులందరు కలిసి భక్తి శ్రద్దల తో సాయిబాబా హారతులు మరియు భజనలు నిర్వహిస్తున్నామని, ప్రతిష్టా కార్యక్రమం ఇంత వైభవం గా జరిగినందుకు చాలా సంతోషం గా ఉందన్నారు. ఇక్కడ ఉన్న పదిహేడు వేల చదరపు అదుగుల స్థలం లో భవిష్యత్తు లో ఉత్తర అమెరికా లోనె అతి పెద్ద సాయిబాబా ఆలయం నిర్మించే ఆలొచన లో ఉన్నామన్నారు.

మూడు రోజుల ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం సుమారు మూడు వందల మంది కి అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని శ్రీమతి నీలిమ శ్రీనివాస్ వేమూరి, సెల్వి విష్ణు కుమార్, తనూజ శ్రీనివాస్ వడ్డమాని, మోనికా మహేష్ భుతి, పల్లవి అమిత్ షహసానె, రోహిణి జితేంద్ర వైద్య, శుభ రఘు మెల్గిరి, కల్పన మురళీ తమ్మినాన, సుజని మురళీ గింజుపల్లి, హేమమాలిని మహేష్ సమతం మరియు నికిత రాహుల్ గుప్త నిర్వహించారు.

ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మిచిగన్ లో స్థిరపడ్డ భారత సంతతి వైద్యులు డాక్టర్ కె.పి. కరుణాకరన్-లక్ష్మి, రఘురాం సర్వేపల్లి, నరేంద్రకుమార్, కిశోర్ బాబు- సామ్రాజ్యం కొండపనేని, సుబ్బారావ్-వాణి శ్రీ చావలి, సుబ్రహ్మణ్యం-సుందర యాదం,ఆనిరుధ్-విద్య భండివార్, విజయా రావ్ ల తో పాటు డెట్రాయిట్, ఫ్లింట్, గ్రాండ్ రాపిడ్స్, మిడ్ ల్యాండ్, బేసిటి, సాగినా, కెనడా ల నుండి సుమారు ఐదువందల మంది ప్రవాస భారతీయులు హజరయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected