Connect with us

Devotional

మిచిగన్ సాగినాలో సాయి సమాజ్ లోగో ఆవిష్కరించిన గాయకులు మనో

Published

on

ఉత్తరమెరికా లోని మిచిగన్ స్టేట్, సాగినా లో సాయి సమాజ్ ఆఫ్ సాగినా లోగో ని ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ మనో గారు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయనతో పాటు స్థానిక వైద్యులు డాక్టర్ రఘురాం సర్వేపల్లి గారు లోగో ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపకులు డాక్టర్ మురళీ గింజుపల్లి గారు మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి గురువారం ప్రవాస భారతీయులందరు కలిసి భక్తి శ్రద్దల తో సాయిబాబా హారతులు మరియు భజనలు నిర్వహిస్తున్నామని, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి, మనో గారు తమ ఆహ్వానం మేరకు వచ్చి లోగో ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

అలాగే ఆగస్టు 11, 12, 13 తేదీ లలో ఇక్కడ జరిగే సాయి బాబా విగ్రహ ప్రతిష్ట లో భక్తులందరు పాల్గొనవల్సింది గా ప్రవాస భారతీయులను ఆహ్వానించారు. శ్రీ మనో గారు మాట్లాడుతూ, ఇక్కడ కు వచ్చి, బాబా హారతి లో పాల్గొని, భక్తులందరిని కలవడం చాలా సంతోషం గా ఉందన్నారు. తదనంతరం జరిగిన మనో సంగీత విభావరి కార్యక్రమాన్ని స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకట్ చౌదరి ముల్పూరి గారు సాయి బాబా ప్రార్థనా గీతం తో ప్రారంభించారు. తరువాత శ్రీ మనో గారి తో పాటు స్థానిక గాయకులు శివాని అన్నాదురై, సుమేధా వడ్లమూడి, శైలి అన్నాదురై, శాంతి, వల్లి మరియు రోహిణి జితేందర్ లు హింది, తెలుగు, మరియు, తమిళం భాషా పాట లతో ఆహుతులని ఉర్రూతలూగించారు.

ఈ కార్యక్రమం లో శ్రీ మనో గారిని డాక్టర్ బుచ్చిబాబు గారు మరియు శ్రీమతి సామ్రాజ్యం కొండపనేని గార్లు శాలువా మరియు పూల బోకె ల తొ సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమం లో డాక్టర్ శ్రీధర్ గింజుపల్లి, డాక్టర్ లీలా పాలడుగు, శ్రీనివాస్ వేమూరి, నీలిమ వేమూరి, హరిచరణ్ మట్టుపల్లి, లక్ష్మి మట్టుపల్లి, సెల్వి విష్ణుకుమార్, కృష్ణ జన్మంచి, డాక్టర్ రమా ముల్పూరి, శ్రీమతి సుజని గింజుపల్లి గార్ల తోపాటు సుమారు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గిన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected