Sacramento, California: శాక్రమెంటో తెలుగు సంఘం (Telugu Association of Greater Sacramento – TAGS) ప్రచురించే “శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక” 2023 ఏడాది నుండి వార్షిక పత్రిక రూపంలో వెలువడుతున్న విషయం మీకు తెలిసిందే. రెండు వార్షిక సంచికల తరువాత మా మూడవ వార్షిక సంచికను జనవరి 18, 2026 న విడుదల చేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. ఈ మూడవ వార్షిక సంచికలో మీ విలువైన రచనలను ప్రచురించడానికి ఇదే ఆహ్వానం.
ఆహ్వానించే రచనల వివరాలు
రచనల అంశాలు
కథలు, కవితలు
మీరు సందర్శించిన ప్రాంతాల విశేషాలు, చిత్రాలు
వ్యాసాలు (ఆధ్యాత్మికం, పరిశీలన, పరిశోధన, విమర్శ తదితర)
పుస్తక పరిచయం, జోక్స్
స్థానిక తెలుగు కుటుంబాలు లేదా వారి పిల్లల ప్రతిభా పాటవాల గురించి పిల్లలు, పెద్దలు వేసిన బొమ్మలు మరియు ఫోటోలు
రచనలు సమర్పించే విధానం
మీ రచనలను తెలుగులో టైపు చేయడానికి మీరు ఉపయోగించవలసిన సాధనాలు
లేఖిని: http://lekhini.org (లేదా)
గూగుల్ ఇన్పుట్ సాధనం: https://www.google.com/intl/te/inputtools/try/
రచనలను పంపవలసిన ఈమెయిల్ చిరునామా: telugusac@yahoo.com
ఆపై మీ రచనలను పరిశీలించి ప్రచురించే బాధ్యత మాదేనని సవినయంగా మనవి చేస్తున్నారు.
ముఖ్యమైన నియమాలు
మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 20, 2025. అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, వెబ్ సైట్స్, పత్రికలు మొదలైన వాటిల్లో ఇప్పటికే ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ ఆహ్వానం రచనల పోటీకు కాదు, మీ రచనలకు ఏవిధమైన పారితోషికం చెల్లించబడదు. రచనలలోని అంశాలకూ, అభిప్రాయాలకూ, అచ్చుతప్పులకూ తత్సంబంధిత రచయిత/రచయిత్రులదే బాధ్యత. పత్రిక లోని రచనల సర్వహక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి.
వార్తాలేఖ నమోదు & పూర్వ సంచికలు
“శాక్రమెంటో తెలుగు వెలుగు” సంచిక మీ ఈమెయిలుకు ఠంచనుగా అందాలంటే, ఈరోజే ఈ లంకె ద్వారా టాగ్స్ న్యూస్ లెటర్ కు నమోదు చేసుకోగలరు: https://tinyurl.com/jointags
Telugu Association of Greater Sacramento (TAGS) పూర్వ సంచికలు: https://sactelugu.org/tags-patrika/