అమెరికాలోని తెలుగు వారి కోసం ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ఆధ్వర్యంలో స్వరాష్ట్రాల్లోని సాటి తెలుగు వారి అభ్యున్నతి కోసం చేపడుతున్న అనేక సామాజిక సేవలలో భాగంగా “రైతు కోసం తానా” అనే కార్యక్రమం చేపట్టింది.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందచేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొవ్వ గ్రామానికి చెందిన మధు యార్లగడ్డ (Madhu Yarlagadda) అద్వర్యంలో అనీల్ యలమంచిలి (Anil Yalamanchili), సుధాకర్ బొడ్డు (Sudhakar Boddu) నిన్న మొవ్వ గ్రామంలో రైతు కోసం తానా కార్యక్రమం నిర్వహించారు.
తానా అట్లాంటా (Atlanta) ఫ్రెండ్స్ సౌజన్యంతో ఈ కార్యక్రమం రూపుదాల్చింది. మొవ్వ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతులకు (Farmers) సుమారు 1,25,000 రూపాయల విలువయిన పవర్ స్ప్రేయర్ లను స్థానిక MLA శ్రీ వర్ల కుమార్ రాజా (Varla Kumar Raja) గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచెయ్యటం జరిగింది.
ఈ రైతు కోసం తానా కార్యక్రమంలో మొవ్వ గ్రామస్థులు వీరమాచనేని వెంకటేశ్వర ప్రసాద్, మండవ కోటేశ్వర రావు, బ్రమ్మేశ్వర రావు, రత్నగిరి, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ తానా (Telugu Association of North America – TANA) నాయకులను, దాతలను అభినందించారు.