అట్లాంటా, జార్జియ మనబడి బృందం మొదటిసారి తెలుగుకు పరుగు( Run4Telugu) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మనబడి (Silicon Andhra Manabadi) లో పిల్లలను నమోదు చేయించారు. అట్లాంటా (Atlanta) లోని తెలుగు వారందరికి, వారి ముందు తరాలవారందరికి మాతృభాషను అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పరుగు జరిగింది.
ఇదే రోజున అమెరికా మరియు ఇతర దేశాలలోని వివిధ కేంద్రలలో “తెలుగుకు పరుగు” నిర్వహించారు. షారన్ స్ప్రింగ్స్ పార్క్ (Sharon Springs Park) లో జరిగిన ఈ తెలుగుకు పరుగు (Run4Telugu) లో దాదపు 250 మందికి పైగా పాల్గొన్నారు. అట్లాంటా ప్రాంతీయ సమన్వయకర్త విజయ్ రావిళ్ళ గారు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
విజయ్ రావిళ్ళ (Vijay Ravilla) మనబడి గురించి తెలియపరుస్తూ, పిల్లలను తెలుగు తరగతులకు నమోదు చేసుకోవలసిందిగా కోరి, పరుగుని ప్రారంభించారు. ప్రాంతీయ సహ సహసమన్వయకర్త సుచేత కాంచనపల్లి (Sucheta Kanchanapalli) గారు, మేరియెట్ట (Marietta) సమన్వయకర్త భారతి అన్నే (Bharati Anne) గారు ఈ పరుగులో పాల్గోన్న వారందరిని నమోదు చేసుకుని మనబడి (Silicon Andhra Manabadi) లో తరగతుల గురించి వారికి వివరించారు.
ఆల్ఫరెట (Alpharetta) సమన్వయకర్త యశ్వంత్ జొన్నలగడ్డ (Yashwanth Jonnalagadda) గారు పరుగుకు కావలసిన అన్ని సదుపాయాలను అమర్చి పరుగు నిర్విఘ్నంగా జరిగేందుకు సహాయపడ్డారు. తామా (TAMA) నుంచి బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ ఉప్పు గారు, అధ్యక్షులు సురేష్ బండారు గారు మరియు తామా బృందం కూడా పరుగులో పాల్గోని, మనబడికి తామా మద్దతుని ప్రకటించారు.
తెలుగుకు పరుగు సమన్వయ కర్త యశ్వంత్ జొన్నలడ్డ గారు ఈ కార్యక్రమానికి సహాయపడిన Go Green Team మాలిని గారికి, కల్యాణి గారు మరియు వారి బృందానికి, Hot Breads యాజమాన్యంకి, తామా (TAMA) బృందానికి, బాలగురువులకు, మనబడి ఉపాధ్యాయులకు (Teachers), పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సహాయపడిన వాలంటీర్స్ (Volunteers) మృదుల, విజయ్ కొంకిమళ్ళ, రావుఆలూరి, రఘు తులిమిల్లి, కృష్ణ మజ్జిగ, శ్రీరామ్, శివ, శ్రీదివ్య, గౌరీ బానవతుల, ధార సింగ్ పోరిక, విజయ్ కుందేటి, గౌతం, అనూష, ఫణి జమ్ముల గార్లకు మరియు ఇతర సహయకులకు ధన్యవాదాలు తెలిపారు.
మనబడి ఉపాధ్యాయులు సంపత్ గంజి, ప్రదీప్ గార్లు, ClayGanesha.org ఆధ్వర్యంలో పిల్లలు ఎంతో ఉత్సహంతో మట్టి వినాయకుడి (Lord Ganesh) ప్రతిమలను చేశారు. పరుగు (Run4Telugu) తరువాత అందరు కాఫీ, టీ, అల్పాహారముని (Breakfast) సేవించి తెలుగుకు పరుగు కార్యక్రమాన్ని ఎంతగానో అభినందించారు.
తెలుగుకు పరుగు (Run4Telugu) లో గెలిచిన పిల్లలకు, పెద్దలకు చివరలో సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi) అట్లాంటా బృందం (Teachers, Coordinators, Volunteers) పతకాలను అందజేసి అభినందించారు. తెలుగుకు పరుగులో విజేతల వివరాలు ఇవిగో.