మార్చ్ 31న అట్లాంటాలో రాగం తాళం పల్లవి సంగీత పాఠశాల మొట్టమొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత గురువు శ్రీవల్లి శ్రీధర్ స్థాపించిన రాగం తాళం పల్లవి సంగీత పాఠశాలలో కర్ణాటిక్, స్వర మరియు భక్తి సంగీతం, రామదాసు మరియు అన్నమాచార్య కీర్తనలు, అలాగే సినీ గేయాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు అందరూ కలిసి తాము నేర్చుకున్న సంగీతాన్ని ఈ వార్షికోత్సవంలో వినసొంపుగా ప్రదర్శించారు. చిన్న చిన్న పిల్లలు చక్కగా ముస్తాబై వచ్చి కీర్తనలు, భక్తిరస గేయాలు ఆలపిస్తుంటే విస్తుపోవడం ప్రేక్షకుల వంతైంది. ఈ కార్యక్రమానికి వాకిటి క్రియేషన్స్ డీజే చేయగా హిమ దీప్తి ఫోటోగ్రఫీ సేవలు అందించారు. అలాగే అట్లాంటాలోని తామా, ఆటా, గాట పెద్దలు మరియు బాల రెడ్డి ఇందుర్తి, మాధవి ఇందుర్తి, నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, విజు చిలువేరు, అనిల్ రెడ్డి బోదిరెడ్డి, శివకుమార్ రామడ్గు తదితరులు పాల్గొని చిన్నారులను జ్ఞాపికలతో దీవించారు.