Connect with us

Movies

ఆర్ (రాజమౌళి) ఆర్ (రాంచరణ్) ఆర్ (రామారావు) ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా రివ్యూ

Published

on

చిత్రం: ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం రణం రుధిరం’
జోనర్: డ్రామ, ఫిక్షన్ మరియు ఏక్షన్
భాషలు: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు హిందీ.
దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి
నటీనటులు: జూనియర్ ఎన్.టి.ఆర్, రాంచరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ తదితరులు
సంగీతం: కీరవాణి
ఫోటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్
విడుదల: మార్చి 25, 2022

మూలకథ: మన్యంలో మల్లెని రక్షించాలని ఒకరు, పుట్టిన మట్టికి స్వతంత్రం ఇవ్వాలని మరొకరు. దీని చుట్టూ తిరిగే కదానికే మన ఆర్ఆర్ఆర్.

ప్రేరణ: “ఆర్ఆర్ఆర్ యొక్క ప్రేరణ ది మోటార్ సైకిల్ డైరీస్ నుండి వచ్చింది. చే అనే పాత్ర గెవారా అనే విప్లవకారుడిగా ఎలా మారుతుందో, నా కథానాయకుల పాత్రలను ఒక సాధారణ పాయింట్ చుట్టూ, ఇలాంటి మార్గాల్లో ఎలా రూపొందించారో నేను ఆకర్షితుడయ్యాను” అని రాజమౌళి చెప్పారు. చరణ్, రామారావు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ యొక్క యువ వెర్షన్లను పోషించారు.

డైరక్టర్: 350 కోట్లు ఖర్చు పెట్టి $35తో ఆకర్షించారంటే అది రాజమౌళి ప్రత్యేకత మాత్రమే. డైరక్టర్ కెప్టన్ ఆఫ్ ది షిప్ అనే నానుడికి ప్రాణం పొసే దర్శకరత్న రాజమౌళి. ఉత్తర అమెరికాలో ప్రీమియం షో కి 3 మిలియన్ డాలర్లు వసూల్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే.

సంగీతం: కీరవాణి స్వరపర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అత్యంత అద్బుతంగా ఉంది. కొమరం బీం అనే పాటని చాల హృద్యంగా తీసారు.

ఫోటోగ్రఫీ డైరెక్టర్: కె.కె.సెంథిల్ కుమార్ చిత్రీకరణ చాలా బాగుంది. కొన్ని కొన్ని షాట్స్ ఐమాక్స్ లో చూస్తున్నప్పుడు కళ్ళు తిరిగాయా అనే విధంగా ఉన్నాయి.

విజువల్ ఎఫెక్ట్‌: శ్రీనివాస్ మోహన్ పర్యవేక్షణలో వివిద విఎఫెక్ష్ కంపెనీలు అందిచిన విజువల్స్ అద్బుతహ.

ప్రొడక్షన్ డిజైనర్‌: సాబు సిరిల్ రాజమౌళి గారికి వెన్నంటే ఉండి పూర్తిస్తాయి ప్రొడక్షన్ సపోర్ట్ ఇవ్వడంలో సఫళీకృతం అయ్యారు.

తారాగణం:
జూనియర్ ఎన్.టి.ఆర్ – కొమరం భీమ్ గా పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అంటే కొమరం భీమ్ ఇలానే ఉంటాడేమో అని అనిపించేటంతగా. నవరసాలు పండించడంలో వీరికి వీరే సాటి.
రాంచరణ్ – అల్లూరి సీతారామరాజు పాత్రలో విలక్షణ మైన నటన చూపించడంలో అభిమానులను ఆకట్టుకొన్నారు. ఒక మొండోడుగా, మొరటోడుగా, ఒక మనసున్నవాడిగా ఇలా ప్రతీ ఫ్రేం లో భిన్నంగా కనపడే విధానంలో మెగాస్టార్ నే మించిపోయారు.
అలియా భట్ – సీతా గా తనకున్న పరిధిలో చక్కగా నటించారు. వీరి పాత్రకి ఇంకా కొద్దిగా ముఖ్య భూమిక ఇచ్చి ఉంటే బాగుండేది.
ఒలీవియా మోరిస్ – జెన్ని తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా ముఖ్యమైన సన్నివేశాలు మాత్రం ఈమెవే.

ఆకట్టుకొనే సన్నివేశాలు:

  1. అల్లూరి సీతారామరాజు పాత్రలో చివర్లో జరిగే ఫైట్ లో అగ్ని గోళం మధ్యలో కనపడే సీతారామరాజు పాత్ర కి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.
  2. ట్రైన్ ప్రమాదం నుండి చిన్న కుర్రాడిని కాపాడే సన్నివేశంలో ఇద్దరి నటన చూడ ముచ్చటగా ఉంది.
  3. ఒక మొండి పోలిస్ గా వందల మంది గుంపులోనికి పోయి వారితో ఫీట్ చేసే సీన్.
  4. వివిధ అడవి మృగాలతో తెల్లవాళ్ళమీద ఒకే సారి కొమురం భీమ్ ఎటాక్ చేసే సీన్.
  5. కొమరం భీమ్ పులిని వేటాడే సన్నివేశం.
  6. నాటు నాటు సాంగ్.

వీక్ సన్నివేశాలు:
ద్వితీయార్ధంలో ఒకానొక సమయంలో సాగదీత వల్ల కొద్దిగా బోర్ కొడుతుంది. ఇదొక్కటే వెలితి.

చివరిమాట: మూడు ఆర్స్ తో విజువల్స్ కూడా ఆర్ఆర్ఆర్ లో హీరోనే.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected