తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి గార్ల ప్రోత్సహoతో తానా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ సోంపల్లి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”. తానా న్యూ ఇంగ్లాండ్ రిఫ్రెష్ వర్క్‌షాప్ (Refresh Workshop) పూర్తి వేగంతో దూసుకుపోతోంది.
అమెరికాలో ప్రతివారం మన హృదయాలను కలిచివేసే విద్యార్థుల్లో విషాదం సంఘటనలు వింటూనే ఉంటాం. అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ భాదకరమయిన సంఘటనలు చూస్తున్నా, వింటున్నా, హృదయం అతలాకుతలం అవుతుంది. తానా (Telugu Association of North America) రిఫ్రెష్ వర్క్‌షాప్ విభిన్నమైన కార్యక్రమం మరియు అంతర్జాతీయ విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతుంది.
కాలేజీలో అంతర్జాతీయ విద్యార్థుల ఓరియంటేషన్ ఆవశ్యకత, ఆపదలో పెప్పర్ స్ప్రే ఎలా ఉపయోగించాలి, పని చేసే ప్రదేశంలో ఎలా ప్రవర్తించాలి, రూమ్ మేట్స్‌తో ఎలా ప్రవర్తించాలి, వేడుకల సమయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, సోషల్ మీడియా ప్రపంచం లో మునిగిపోకుండా, అందరితో సామరస్యంగా ఎలా వుండాలి, ఎవరికైనా గాయమైతే మనం వెంటనే ఏమి చేయాలి, ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఏమి చేయాలి, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడుతూ ఉండాలి ఇలాంటి విషయాలు విశిధీకరంచి చెబుతారు.
తానా రిఫ్రెష్ ప్రోగ్రామ్ అంతర్జాతీయ విద్యార్థుల (Students) మైండ్ సెట్‌ను రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా విషాదాలను తగ్గించవచ్చు. విద్యార్థులు ఎవరైనా రిఫ్రెష్ ప్రోగ్రామ్ (TANA Refresh Workshop) చేయాలనుకుంటే ఫోన్ ద్వారా కూడా చేయవచ్చు. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ చూడండి.