ఒకరి కష్టానికి మరొకరు మేము ఉన్నామని, సహాయం ఎక్కడ నుండి అందినా, అందకున్నా,
సాటి రెడ్డికి కష్టం తెలియజేస్తే, సాధ్యమైనంత వరకు లేదా వివిధ చోట్ల ప్రయత్నించి సాధ్యమైనంత మేర రెడ్డన్న..నేను ఉన్నా అని సాటి రెడ్డి తరలి రావడం విశేషం అంటున్నారు Reddys Association of America (RAAM) సభ్యులు.
మానవీయత కోణంలో స్పందించి, తెలంగాణ (Telangana) లోని కోతులాపురం గ్రామానికి చెందిన రైతు రెడ్డన్నకు అనుకోని సంఘటనలో యాక్సిడెంట్ జరిగి వెన్నుముక సమస్యతో బాధ పడుతున్న విషయాన్ని, విద్య సరస్వతుల్లా చదువుతున్న రెడ్డి బిడ్డలకు చదువులో సాయం అందించాలని సంకల్పించి ఫండ్ రైజింగ్ ద్వారా 3,53,000 రుపాయలు ఆర్ధిక సహాయం (Financial Help) చెక్కు రూపంలో అందజేయడం జరిగింది.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రతిభావంతులైన ఇద్దరు నిరుపేద Reddy విద్యార్థుల మంచి కోసం Reddys Association of America (RAAM) సభ్యులు, దేశం కాని దేశంలో వుండి కూడా మేము సైతం అని మానవీయంగా స్పందించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.
Reddy Helpline ఈ సందర్భంగా RAAM Dallas group, Praveen Reddy, Krishna Reddy Konduru, Sreenivasa Reddy Gali, Praveen Reddy Billa. Vishwa (Desi District), Mallikarjun Reddy, RamaChandra Reddy Seelam, Vamsi Malgireddy – Inspirix లకు కృతజ్ఞతలు తెలిపారు.