Connect with us

Picnic

రాయల అట్లాంటా గ్రూప్ ఆధ్వర్యంలో రాయలసీమ పిక్నిక్

Published

on

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాయల అట్లాంటా గ్రూప్ ఆధ్వర్యంలో రాయలసీమ పిక్నిక్ జులై 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. పీచ్ ట్రీ కార్నర్స్ లోని పింక్నెవిల్ పార్కులో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ రాయలసీమ పిక్నిక్ లో స్వచ్ఛమైన రాయలసీమ రుచులను వడ్డించేలా ప్లాన్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఎస్టేట్ ప్లానింగ్, కాలేజ్ అడ్మిషన్స్, ఆరోగ్య సలహాలు, స్కూల్ సేఫ్టీ టౌన్ హాల్ మీటింగ్ వంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాయలసీమ పిక్నిక్ కి ఉత్తర అమెరికా తెలుగు సమితి ‘నాటా’ గ్రాండ్ స్పాన్సర్ కాగా, సువిధ, శ్రీలలిత రైస్, ఎన్జిఆర్ రియాల్టీ ఫర్ ఎన్నారైస్ మరియు ఆల్ఫా ఫ్యామిలీ మెడిసిన్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వివరాలకు శ్రీనివాస్ కొట్లూరి (404-426-8596), రామ్ భూపాల్ (847-220-2083) మరియు నంద గోపినాథ్ రెడ్డి (404-704-5713) లను సంప్రదించండి. అట్లాంటా పరిసర ప్రాంతాల వాసులందరూ స్నేహితులతో మరియు కుటుంబ సమేతంగా పాల్గొని రాయలసీమ పిక్నిక్ ని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected